రాష్ట్రంలో ఏరులైపారుతున్న బీరు.. మండే ఎండల్లో నీటి కటకటతో రికార్డు స్థాయిలో అమ్మకాలు.. గతేడాది రికార్డ్స్ బ్రేక్..

by Dishafeatures3 |
రాష్ట్రంలో ఏరులైపారుతున్న బీరు.. మండే ఎండల్లో నీటి కటకటతో రికార్డు స్థాయిలో అమ్మకాలు.. గతేడాది రికార్డ్స్ బ్రేక్..
X

దిశ, ఫీచర్స్: కర్ణాటకలో నీటి సంక్షోభం నెలకొంది. ఉష్ణోగ్రతలు కూడా రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. దీంతో బీర్ల అమ్మకాలు కూడా రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా సిలికాన్ వ్యాలిగా ప్రసిద్ధి చెందిన ఆ రాష్ట్ర రాజధాని బెంగళూరు.. మొత్తం సౌత్ ఇండియాలోనే బీర్ వినియోగ కేంద్రంగా నిలుస్తుంది.

కర్ణాటకలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అమ్మకాల పెరుగుదల మధ్య సంబంధం రోజురోజుకు పెరుగుతుండగా.. ఏప్రిల్‌లో గత 15 రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 23.5 లక్షల కార్టన్ బాక్సుల బీర్లు అమ్ముడైనట్లు ఎక్సైజ్ శాఖ రిపోర్టు. కాగా లాస్ట్ ఇయర్ డేటాతో పోల్చితే ఈ ఏడాది ప్రారంభం నుంచే బీర్ అమ్మకాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఫిబ్రవరి, మార్చి రెండింటిలోనూ బీర్ విక్రయాలు మునుపటి సంవత్సరం రికార్డులను అధిగమించగా.. ఇప్పటి వరకు వేసవిలో అమ్మకాలలో 30% పెరుగుదల నమోదు అయింది. ఈ నెలలో డిమాండ్‌ మరింత గణనీయంగా పెరిగింది. కాగా ఈ డిమాండ్‌ను తీర్చడానికి తగినంత స్టాక్‌ ఉందని ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ భరోసా ఇస్తుంది.

Next Story

Most Viewed