- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Aliens : సముద్ర గర్భంలో వింత ఆకారాలు.. ఏలియన్స్ పనేనా?
దిశ, ఫీచర్స్ : పరిశోధనలు అన్ని సందర్భాల్లో సక్సెస్ కాకపోవచ్చు. కొన్నిసార్లు మిస్టరీలుగానే మిగిలిపోవచ్చు. కానీ వృథా మాత్రం కావు. అప్పటికప్పుడు రహస్యాలను ఛేదించలేకపోయినా, ఆ తర్వాత అయినా అసలు విషయాలను తెలుసుకునేందుకు, మరో కోణంలో పరిశోధించేందుకు అవసరమైన అనుభవాన్ని, సమాచారాన్ని రీసెర్చర్స్ పొందగలుగుతారు. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.
వైరల్ అవుతున్న వీడియో ఇన్ఫర్మేషన్ ప్రకారం.. నేషనల్ ఓసియానిక్ అండ్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA)కు చెందిన రీసెర్చర్స్ నిరంతర అన్వేషణలో భాగంగా అట్లాంటిక్ సముద్రంలోని అడుగు భాగంలోకి వెళ్లారు. అక్కడ వారికి సాధారణంగానే సముద్ర గర్భంలో ఉండే మొక్కలు, చేపలు, పగడపు దిబ్బలు, వివిధ సముద్ర జీవులు కనిపించాయి. అది సహజమే కదా అని వెనుదిరుగుతుండగా.. దీర్ఘ చతురస్రాకారంలో ఉండే కొన్ని చిన్నపాటి వింత ఆకారాలు ఆకర్షించాయి.
సముద్ర గర్భంలో కనిపించిన వింత ఆకారాలను శాస్త్రవేత్తలు దగ్గరికి వెళ్లి చూడగా.. అవి వరుసగా 10 నుంచి 12 సెంటీమీటర్ల గ్యాప్‌లో ఉండే కన్నాలుగా గుర్తించారు. చూడ్డానికి పైకి సన్నగా, అన్ని ఒకే సైజులో అనిపించినప్పటికీ లోతుగా ఉన్నట్లు కనుగొన్నారు. అయితే అవి అక్కడ ఎందుకు ఉన్నాయి? మానవ చర్యలే కారణమా? ప్రకృతి సిద్ధంగా ఏర్పడినవా? అనే విషయాలను మాత్రం ఇంకా ఛేదించలేకపోయారు. ఇదిలా ఉండగా కొందరు ఔత్సాహికులు ఏలియన్స్ పని అయ్యుంటుందని కూడా భావిస్తున్నారు. మొత్తానికి ఆ మిస్టరీని ఛేదించే పనిలో ఓసియానిక్ సైంటిస్టులు నిమగ్నమై ఉన్నట్లు తెలుస్తోంది.