అలర్ట్: మధ్యాహ్నం హాయిగా నిద్ర పోతున్నారా..? అయితే ప్రమాదంలో పడ్డట్టే..!

by Kavitha |
అలర్ట్: మధ్యాహ్నం హాయిగా నిద్ర పోతున్నారా..? అయితే ప్రమాదంలో పడ్డట్టే..!
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా చాలా మందికి మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు ఉంటుంది. రాత్రి సరిగా నిద్ర లేకపోవడం వల్లనో, ఉదయం నుంచి వర్క్ చేసి అలసిపోయి నిద్రపోవడమో జరుగుతుంది. అయితే అలా నిద్రపోవడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. మరి మధ్యాహ్నం పడుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

బేసిక్‌గా చాలామంది వారు చేసే పని నుంచి అలసటను తగ్గించుకోవడానికి మధ్యాహ్న సమయంలో నిద్రిస్తూ ఉంటారు. అయితే ఇందులో కొన్ని లాభాలు కొన్ని నష్టాలు కూడా ఉంటాయట. సాధ్యమైనంతవరకు మధ్యాహ్న సమయంలో ఒక అరగంట లేదా గంటపాటు మాత్రమే నిద్రించాలని అలా చేసినట్లయితే ఎలాంటి సమస్యలు ఉండవని... అంతకు మించి నిద్రించి నట్లయితే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. మరి సూచనలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

*మధ్యాహ్నం సమయంలో నిద్ర పోవడం వల్ల రాత్రి సమయంలో నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి.

*అలాగే మధ్యాహ్నం అతిగా నిద్రపోవడం వల్ల బ్లడ్, షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉండవు. దీనివల్ల చాలా మందికి మధుమేహ సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంటుంది.

*అదేవిధంగా అతిగా మధ్యాహ్నం నిద్ర పోవడం వల్ల మలబద్ధకం లాంటి సమస్యలు వస్తాయి.

*అయితే చాలా మంది తిన్న వెంటనే మధ్యాహ్నం పడుకుంటారు. అలా పడుకోవడం వల్ల మధ్యాహ్నం జీర్ణప్రక్రియ మందగించడం జరుగుతుంది.

నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

Advertisement

Next Story

Most Viewed