- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శారీరక బలహీనత, మానసిక ఒత్తిడికి దారితీస్తున్న అడ్రినల్ ఫెటీగ్
దిశ, ఫీచర్స్ : ఈ మధ్య చాలామందిలో ‘అడ్రినల్ ఫెటీగ్’ సమస్య పెరుగుతోందని, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది దీనిని ఎదుర్కొంటున్నారని వైద్య నిపుణులు చెప్తున్నారు. శారీరక బలహీనత, తరచూ నీరసం, కాస్త శారీరక శ్రమ చేయగానే తీవ్రమైన అలసటగా అనపించడం ఈ వ్యాధి ప్రత్యేకత. దీనివల్ల రోజువారీ సాధారణ కార్యకలాపాలు నిర్వహించడం కూడా ఇబ్బందిగా మారుతుంది. మూత్ర పిండాలపై భాగంలో ఉండే అడ్రినల్ గ్రంథులు సరిగ్గా పనిచేయకపోవడంవల్ల ఈ అడ్రినల్ ఫెటీగ్ లేదా అడ్రినల్ ఎగ్జాస్షన్ అనే ఆరోగ్య సమస్య తలెత్తుతుంది.
లక్షణాలు
తీవ్రమైన అలసట, అధికంగా మానసిక ఒత్తిడి, నిద్రలేమి, తీపి, ఉప్పగా ఉండే ఫుడ్స్ ఎక్కువగా తినడం, బద్ధకం ఆవహించడం, మహిళల్లో అయితే ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్, మెనోపాజ్ సమయంలో లో బ్లడ్ ప్రెషర్ వంటివి కూడా ఈ వ్యాధి లక్షణాలుగా ఉంటాయి. ఇటువంటి సందర్భాల్లో అడ్రినల్ గ్లాండ్స్ శరీర అవసరాలను తీర్చడంలో సరిగ్గా స్పందించవు.
నివారణ
కొన్ని రకాల ఆహారాలు, మందుల ద్వారా ఈ సమస్య తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా పోంతోతేనిక్ యాసిడ్‌గా(Pantothenic acid) పిలువబడే ఆహారం (విటమిన్ B5) దీనిని నివారిస్తుంది. ఇది ఒత్తిడి సమయంలో కార్టిసాల్ ఎంజైమ్‌ను సమతుల్యం చేస్తుంది. ఆస్ట్రాగాలస్ అనే ఒక రకమైన పువ్వును కూరగాయగా ఉపయోగించడంవల్ల కూడా ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటు అడ్రినల్ ఫెటీగ్ సమస్య దూరం అవుతుంది. అలాగే విటమిన్ B6. దీనిని పిరిడాక్సిన్ అని కూడా అంటారు. ఇది మెడికల్ షాపుల్లో సిరప్ రూపంలో లభిస్తుంది. డాక్టర్ల సిఫార్సు మేరకు మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇది నాడీ వ్యవస్థను ఉత్తేజ పరిచి, ఒత్తిడిని దూరం చేయడంవల్ల అడ్రినల్ ఫెటీగ్ సమస్యకు చెక్ పెడుతుంది. అలాగే నారింజ, నిమ్మకాయలను ఆహారంగా తీసుకోవడంవల్ల వీటిలోని విటమిన్ సి అడ్రినల్ అలసటను తగ్గిస్తుంది. కార్డిసెప్స్ సప్లిమెంట్స్, ఆహారాలు కూడా అలసటను దూరం చేయడంతోపాటు బ్లడ్‌లో షుగరల్ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తాయి. రోగనిరోధకశక్తిని పెంచుతాయి. ఆకుకూరలు తినడం ద్వారా, సప్లిమెంట్ రూపంలో తీసుకోవడం ద్వారా లభించే విటమిన్ - ఇ కూడా అడ్రినల్ గ్రంథుల పనితీరు మెరుగుపర్చి సమ్యను దూరం చేస్తాయి.
Read more: