మాంసాహారమే కావాలి.. ప్రపంచంలో అత్యధిక మంది ఇష్టంగా తినే జంతు మాసం ఏదో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

by Javid Pasha |
మాంసాహారమే కావాలి.. ప్రపంచంలో అత్యధిక మంది ఇష్టంగా తినే జంతు మాసం ఏదో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
X

దిశ, ఫీచర్స్ : మనం ఆరోగ్యంగా ఉండాలంటే సరైన పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలి. ఇందులో శాకాహారం, మాంసాహారం రెండూ ఉంటాయి. అయితే ప్రపంచంలో అత్యధిక మంది రెండూ తింటారు. పైగా మాంసాహారం తినేవారే అత్యధిక మంది ఉంటున్నారని ఇటీవల యూఎస్‌కు చెందిన ఒక ప్రైవేట్ కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. నాన్‌వెజ్ తినేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని కూడా సర్వే పేర్కొన్నది.

శరీరానికి తగిన విటమిన్లు, ప్రోటీన్లు ఎక్కువగా లభించేది మాంసాహారంలోనే కాబట్టి చాలా మంది తినడానికి ఆసక్తి చూపుతున్నారు. మనదేశంలో అయితే కోడి, మేక, గొర్రె మాంసం ఎక్కువగా వినియోగంలో ఉండగా, మిగతా జంతువుల మాంసం తక్కువగా తింటారు. కానీ ప్రపచంలో అత్యధిక మంది ఎక్కువగా తినేది మాత్రం పంది మాంసమేనని ఒక సర్వేలో తేలింది. ఇక చికెన్ తినేవారు రెండవస్థానంలో, గొడ్డు మాంసం తినేవారు మూడవ స్థానంలో ఉన్నారు. మేకలు, గొర్రెలు వంటి జంతువుల మాంసం తినేవారు నాలుగవ స్థానంలో ఉన్నారు. టర్కీ కోడిని తినేవారు ఐదో స్థానంలో ఉండగా, దీనిని ఎక్కువగా నార్త్ అమెరికన్లు, మెక్సిన్లు తింటున్నారు.

బాతు మాంసం వినియోగదారులు ప్రపచంలో ఆరవస్థానంలో ఉండగా చైనా, అమెరికాలోనే ఎక్కువగా వినియోగిస్తారు. ఏడో స్థానంలో గేదె మాంసం ఉండగా ఆసియాలోని కొన్ని దేశాల్లోనే ఎక్కువగా తింటారు. ఇక 8వ స్థానంలో కుందేలు మాంసం నిలువగా చైనా, ఉత్తర కొరియాల్లోనే దీని వినియోగదారులు ఎక్కువ. జింక మాంసం తినేవారు 9వ స్థానంలో ఉండగా జపాన్‌లో ఎక్కువగా వినియోగిస్తున్నారు. తక్కువ మాంసం వినియోగిస్తున్న దేశంగా భారత్ ఉందని సర్వే పేర్కొన్నది. మరో సర్వేలో మూడింట రెండు వంతుల మంది భారతీయులు మాంసాహారం తింటారని పేర్కొన్నప్పటికీ, సగటు వినియోగంలో తక్కువగా ఉంటోందట. ఇక్కడ ఆధ్యాత్మిక భావాలు, సంప్రదాయాలు వంటివి కూడా మాంసాహారం తక్కువ మంది తినడానికి కారణంగా ఉంటున్నాయి.

Advertisement

Next Story

Most Viewed