ఎలుకల బోను తో హై హీల్స్.. ఫ్యాషన్ లో కొత్త ట్రెండ్ సృష్టించిన మగువ..

by Sumithra |
ఎలుకల బోను తో హై హీల్స్.. ఫ్యాషన్ లో కొత్త ట్రెండ్ సృష్టించిన మగువ..
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుత ప్రపంచంలోని యువతీయువకులు ఫ్యాషన్‌పైనే ఆధారపడి ఉన్నారు. రకరకాల బట్టలు, షూలు, చెప్పులు మొదలైనవాటిని ధరిస్తుంటారు. అలాగే మీరు ఎన్నో ఫ్యాషన్ షోలు చూసి ఉంటారు. అందులో మోడల్స్ వింత దుస్తులతో క్యాట్‌వాక్‌ పై నడుస్తూ ఉంటారు. చాలా సార్లు ఫ్యాషన్ కోసం వింత హైహీల్స్ కూడా ధరిస్తుంటారు. ఇప్పుడు ఇలాంటి ఒక వీడియోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక అమ్మాయి ఓ రకం హై హీల్స్ ను ధరించి కనిపించింది. ఈ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరు ఇదేం ఫ్యాషన్ రా నాయనా అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎలుకలు పట్టుకోవడానికి బోన్ ను వాడడం ప్రతి ఒక్కరూ చేసే ఉంటారు. అయితే ఓ అమ్మాయి ఫ్యాషన్ గా ఉండేందుకు ఎలుకల బోనులను హైహీల్స్‌గా తయారు చేయించుకుని ధరించింది. ఆ హీల్స్ ని చూసిన ప్రతి ఒక్కరు ఔరా అని అబ్బురపోయి ముక్కున వేలేసుకున్నారు. వీడియోలో అమ్మాయి వేసుకున్న బూట్, దాని పై భాగం సాధారణ షూ లా కనిపిస్తుంది. కానీ దాని దిగువ భాగం పంజరంలా ఉంటుంది. అందులో జీవించి ఉన్న ఎలుకలను కూడా లాక్ చేసి ఉంచింది. ఇలాంటి హీల్స్ ను ఇప్పటివరకు ఎవరూ చూసి ఉండరు కదా. ఇంత వింత హైహీల్స్ వేసుకుని అమ్మాయి ఎలా నడుస్తుందో అని ఆశ్చర్యం వేస్తుంది.

ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌మైసీమ్స్ అనే ఐడితో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు రికార్డ్‌గా 115 మిలియన్లు లేదా 11.5 కోట్ల సార్లు వీక్షించారు. అయితే 2 మిలియన్లు లేదా 20 లక్షల మంది వీడియోను కూడా లైక్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed