- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బంధువులను సందిగ్ధంలో పడేసిన వెడ్డింగ్ కార్డు.. ఇంతకీ అందులో ఏముందంటే?
దిశ, డైనమిక్ బ్యూరో: ఒక్కోసారి మనం చేసే పనుల్లో తెలియకుండా తప్పులు జరుగుతుంటాయి. అందులోనూ ఎదుటువారితో మాట్లాడే సమయంలో (ఫోన్ కాల్, చాటింగ్) చిన్నచిన్న అక్షర పొరపాట్లే పెద్ద సమస్యల్ని తెచ్చిపెడుతుంటాయి. ఇక అదే ఓ వెడ్డింగ్ ఇన్విటేషన్‌లో తప్పులు వస్తే బంధువుల ముందు నవ్వులపాలు అవ్వడం ఖాయం. తాజాగా ఓ వెడ్డింగ్ ఇన్విటేషన్‌లో ప్రింటింగ్ మిస్టేక్ జరిగింది. అంతే అతిథులను సందిగ్ధంలో పడేసింది. కార్డు చివరిలో ‘తుమ్ భూల్ జానా ఆనే కో’ (పెళ్లికి రావడం మర్చిపోండి) అని ప్రింట్ అయింది.
ఇది ఎవరి తప్పిదమో తెలీదు కానీ, అతిథుల్ని ఇన్వైట్ చేసేటప్పుడు కూడా పెళ్లివారు పరిశీలించలేదు. ఇక ఇన్విటేషన్ అందుకున్న అతిథులు కార్డ్ చూసి వివాహానికి ఆహ్వానిస్తున్నారా? లేక వద్దంటున్నారా? అనే సందిగ్ధంలో పడిపోయారు. ప్రస్తుతం ఈ కార్డుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అసలే పెళ్లిళ్ల సీజన్ కదా...మీరు కూడా ఇలాగే చేస్తున్నారా ఏంటి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read..