viral : యువతిని చూసి ఆగలేకపోయిన ప్రియుడు.. అందరూ చూస్తుండగానే ఆ పని చేస్తూ.. (వీడియో)

by Dishafeatures2 |
viral : యువతిని చూసి ఆగలేకపోయిన ప్రియుడు.. అందరూ చూస్తుండగానే ఆ పని చేస్తూ.. (వీడియో)
X

దిశ, ఫీచర్స్ : అదేమీ వాళ్ల ఇల్లు కాదు, ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడానికి ప్రైవేట్ ప్లేస్ అంతకంటే కాదు. అయినా ఆ యువతీ, యువకుడు ఏమాత్రం పట్టించుకోలేదు. చుట్టూ నలుగురు ఉంటారు కదా ఏమనుకుంటారోననే ఇంకిత జ్ఞానం కూడా లేకుండా వ్యవహరించారు. అందరు చూస్తుండగానే ఒకరినొకరు హత్తుకుని ముద్దు సీన్లతో రెచ్చిపోయారు. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా, చూసిన వారంతా ఆశ్చర్యపోవడంతోపాటు అసహ్యంచుకుంటున్నారు. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది? అనే కదా మీ సందేహం!

చుట్టూ జనం ఉన్నా అవేమీ పట్టించుకోకుండా పబ్లిక్ ప్లేస్‌లలో పాడుపని చేసుకునే సంఘటనలు ఇటీవల తరచూ జరుగుతున్నాయి. ఆ మధ్య ఢిల్లీ మెట్రోలో ఓ యువజంట రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ వీడియో బాగా వైరల్ కూడా అయింది. ప్రస్తుతం అలాంటి సంఘటనే ఒకటి బెంగుళూరులోని మెట్రో ట్రైన్‌లో జరిగింది. తమ చుట్టూ ప్రయాణికులు ఉన్నారని కూడా చూడకుండా ట్రైన్‌లో యువతీ, యువకుడు ముద్దులు పెట్టుకోవడం ప్రారంభించారు.

ఇద్దరు మరింత రెచ్చిపోతుండటాన్ని చూడలేక ప్రయాణికుల్లో ఒకరు ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాకుండా అసభ్యంగా బిహేవ్ చేసిన సదరు జంటపై యాక్షన్ తీసుకోవాలని యాక్షన్ తీసుకోవాలని ఈ వీడియోను షేర్ చేసిన వ్యక్తి బెంగుళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(BMRCL)ను, పోలీసులను ట్యాగ్ చేస్తూ డిమాండ్ చేశారు. ప్రజెంట్ ఈ న్యూస్ వైరల్ అవుతుండగా నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. పబ్లిక్ ప్లేస్‌లో అసభ్యకరంగా ప్రవర్తించేవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Next Story