- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పిల్లలు పుట్టాక మారిపోతున్న పేరెంట్స్.. సంప్రదాయాలపై మొగ్గు చూపుతారట!
దిశ, ఫీచర్స్ : మీకు ఈ విషయం తెలుసా? బ్యాచిలర్స్‌గా ఉన్నప్పుడు, పెళ్లైన కొత్తలో చాలామంది సంస్కృతి, సంప్రదాయాల పట్ల పెద్దగా ఆసక్తి చూపరు. కానీ పిల్లలు పుట్టాక మాత్రం వాటి గురించి ఆలోచించడమేగా పాటించేందుకు మొగ్గు చూపుతారని ఒక అధ్యయనం పేర్కొన్నది. ఇందులో భాగంగా అమెరికాలోని తులనే యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు10 వేర్వేరు దేశాల్లో 2600 మందిని వ్యక్తులను పరిశీలించారు. వీరిలో సగానికంటే ఎక్కువమంది పెళ్లయిన తర్వాత సంప్రదాయాలవైపు మొగ్గుతారని తేలింది. ఇప్పటికే తల్లిదండ్రులుగా ఉన్న వ్యక్తులు అబార్షన్, సెక్స్ ఇమ్మిగ్రేషన్‌పై సంప్రదాయవాద అభిప్రాయాలను స్వీకరిస్తున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. మరో విషయం ఏంటంటే.. 88 దేశాలలో 4 లక్షల మంది వ్యక్తుల నుంచి ఆర్కైవల్ డేటాతో కనెక్షన్ మరింత బలోపేతం చేయబడింది. ఇది ప్రజలు ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్నందున సంప్రదాయవాద భావాలు బలపడుతున్నాయని పేర్కొన్నది.
మ్యారేజ్ అయినప్పటికీ సంతానంలేనివారు చాలా తక్కువ సంప్రదాయ వాదులుగా ఉంటున్నారని, పిల్లలు లేని వృద్ధులను స్టడీ చేయడం ద్వారా తెలిసిందని పరిశోధకులు పేర్కొన్నారు. పిల్లలతో పాజిటివ్ ఇంటరాక్షన్ లేదా తల్లిదండ్రుల ఆలోచనపట్ల ఆశావాదంతో కూడిన అభిప్రాయాన్ని కలిగి ఉన్న స్టడీ పార్టిసిపెంట్స్ కూడా సామాజిక సమస్యలపై సంప్రదాయవాద అభిప్రాయాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని పరిశోధకులు వెల్లడించారు. దీనిని బట్టి చూస్తే ‘‘తల్లిదండ్రులుగా మారడంవల్ల మీపై ఊహించిన సైకాలాజికల్ ఎఫెక్ట్స్ ఉండవచ్చు’’ అని సీనియర్ పరిశోధకుడు, తులనే స్కూల్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో సైకాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డామియన్ ముర్రే తెలిపారు. భద్రత, స్థిరత్వం, కుటుంబ విలువలు, ఆయా సందర్భాల్లో లభించే మద్దతు వంటి అంశాలే పిల్లలు పుట్టాక పేరెంట్స్‌ను సంప్రదాయ ఆలోచనలవైపు ప్రేరేపిస్తున్నాయని పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకుడు ప్రొఫెసర్ నిక్ కెర్రీ పేర్కొన్నాడు.