భిన్న రూపాల్లో భావోద్వేగాలు.. అనుభూతికి అసలు కారణం ఇదే..

by Javid Pasha |   ( Updated:2024-01-17 13:53:19.0  )
భిన్న రూపాల్లో భావోద్వేగాలు.. అనుభూతికి అసలు కారణం ఇదే..
X

దిశ, ఫీచర్స్ : పాజిటివ్‌గా ఆలోచించాలే గానీ ‘లైఫ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్’ అంటారు నిపుణులు. ప్రతి వ్యక్తి జీవితంలో సానుకూల, ప్రతికూల అంశాలు ఉంటాయి. ముఖ్యంగా వ్యక్తులందరినీ లవ్ అండ్ ఎమోషన్స్ ప్రభావితం చేస్తుంటాయి. ఒక విధంగా చెప్పాలంటే మానవ జీవితం వీటిపైనే అధికంగా డిపెండ్ అయి ఉంటుంది. అందుకే లైఫ్‌లోని ప్రతి దశలో మానవ వికాసానికి, అభివృద్ధికి, అనుబంధానికి, ఆనందానికి ప్రేమ చాలా అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఇది భిన్న ప్రవర్తనలుగా, భిన్న రూపాలుగా వ్యక్తం అవుతూ ఉంటుంది. ఉదాహరణకు పేరంటల్ లవ్, రొమాంటిక్, సెల్ఫ్ లవ్, సెక్సువల్ లవ్, లవ్ ఆఫ్ యానిమల్స్, లవ్ ఆఫ్ నేచర్, లవ్ ఆఫ్ కల్చర్ ఇలా అనేక రకాలుగా ప్రేమ భావాలు వ్యక్తం అవుతుంటాయి. అయితే మానవుల్లో ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ లవ్ అండ్ ఎమోషనల్ ఫీలింగ్స్ లేదా బిహేవియర్స్ ఎలా పుట్టుకొస్తాయి?. వాటిని ఎలా అనుభూతి చెందుతారు? శరీరానికి ప్రేమ, భావోద్వేగాలకు మధ్య ఎటువంటి సంబంధం ఉంది? అనే విషయాలపై ఒక కొత్త అధ్యయనం ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. అవేంటో చూద్దాం.

హ్యూమన్ టచ్ సిచ్యువేషన్

సాధారణంగా మనుషుల మధ్య సందర్భాలు ప్రేమ, భావోద్వేగాలతో ముడిపడి ఉంటాయి. అయితే ఇవి ఆత్మాశ్రయ భావాలను ఎలా ప్రభావితం చేస్తాయనే మానవ అనుభవాన్ని పరిశోధకులు రీసెంట్‌గా ఎనలైజ్ చేశారు. ఇందులో భాగంగా ఫిన్‌లాండ్‌లోని ఆల్టో యూనివర్సిటీకి చెందిన నిపుణులు మానవులు తరచుగా అనుభవిస్తున్న దాదాపు 28 లవ్ అండ్ ఎమోషన్స్‌ను మ్యాప్ చేశారు. అబ్జర్వేషన్‌లో భాగంగా పార్టిసిపెంట్స్ ఒక నిర్దిష్ట పరిస్థితిలో ప్రేమను వ్యక్త పర్చడాన్ని, ఫీల్ అవడాన్ని, ఆ సందర్భంలో శారీరకంగా కలుగుతున్న మార్పులను విశ్లేషించారు. ఏ రకమైన ప్రేమ భావనను శరీరంలోని ఏ భాగంలో అనుభూతి చెందారో గుర్తించడానికి బాడీ ఇమేజెస్ కలిగిన ఆల్బమ్ చూపుతూ సంబంధిత భాగాలను గుర్తించాలని సూచించారు. అయితే లవ్ అండ్ ఎమోషన్ అనేది ఎంత ఆహ్లాదకరంగా, హ్యూమన్ టచ్‌గా ఉంటుందో ఎనలైజ్ చేశారు.

అనుభూతిలో తలభాగమే కీలకం

లవ్ అండ్ ఎమోషన్స్ పరిస్థితుల్లో శరీరంలోని ఇతర భాగాలకన్నా మానవులు తల లేదా మెదడు భాగంలోనే ఎక్కువగా అనుభూతి చెందుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇతర భాగాల్లో తక్కువగా అనుభూతి ఉంటున్నట్లు గమనించారు. అయితే భావోద్వేగాలను బట్టి ఇవి శరీరంలో చెస్ట్ భాగంతోపాటు ఇతర భాగాలకు వ్యాపిస్తాయని పరిశోధకులు అంటున్నారు. స్ట్రాంగ్‌గా ఫీలయ్యే లేదా అనుభవించిన ప్రేమలతో పోల్చితే, తక్కువ ఫీలయ్యే ప్రేమ భావనలు చెస్ట్ ఏరియాలో వీక్ సెన్సేషన్స్ కలిగి ఉంటున్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా వ్యక్తుల మధ్య లవ్ అనేది సెక్సువల్ అండ్ నాన్ సెక్సువల్‌గా కూడా డివైడ్ చేయబడి ఉంటుంది. సన్నిహితంగా ఉండే లవ్ అండ్ ఎమోషన్స్‌లో, మిగతా భావోద్వేగాలలో తేడాలు ఉంటాయనేది నిపుణులు చెప్తున్నమాట. అయితే అంతగా సంబంధం లేదని భావించే వ్యక్తుల మధ్య ఉండే లవ్ అండ్ ఎమోషన్స్ కంటే కూడా.. తరచుగా కలిసి ఉంటున్న వ్యక్తుల మధ్య ఏర్పడే భావోద్వేగాలే బలంగా ఉంటాయని అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా భార్య భర్తల మధ్య సెక్సువల్ రిలేషన్స్, అలాగే పిల్లలు తల్లిదండ్రుల మధ్య ఉండే పేరంటల్ లవ్ అండ్ ఎమోషన్స్ అత్యంత స్ట్రాంగ్‌గా అనుభూతి చెందేలా ఉంటాయని నిపుణులు అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed