జంతువులకంటే పక్షులు తెలివైనవి.. ఎందుకో తెలుసా?

by Hamsa |   ( Updated:2023-08-01 09:45:36.0  )
జంతువులకంటే పక్షులు తెలివైనవి.. ఎందుకో తెలుసా?
X

దిశ, ఫీచర్స్: మీరు పక్షులను ఎప్పుడైనా గమనించారా? ఎప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపిస్తూ ఉంటాయి. వాస్తవానికి జంతువులతో పోల్చినప్పుడు పక్షి మెదడు చిన్నగా ఉంటుంది. అయినా వీటిలో చురుకుదనం ఎక్కువగా ఉంటుందని, తెలివిగా వ్యవహరిస్తాయని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. ఇందులో భాగంగా సైంటిస్టులు వెయ్యికి పైగా వివిధ జంతువులు, కోళ్లు, పావురాలు, ఎగిరే పక్షి జాతులను పరిశీలించారు. కొన్ని క్షీరదాలను మినహాయించి జంతువుల మెదడు తీరును కూడా విశ్లేషించారు.

అయితే పావురాలు, చిలుకలు, ఉష్ర్ట వంటి పక్షి జాతుల మెదడు పరిమాణం వాటి పేరెంట్స్‌ సమకూర్చే ఆహారం, సంరక్షణపై ఆధారడి డెవలప్ అవుతుందని, చిన్నగా ఉన్నప్పటికీ చురుకుగా, తెలివిగా వ్యవహరించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని కనుగొన్నారు. ఇక జంతువులలో తరచుగా టాస్క్ సాల్వింగ్, సామాజిక అంశాలు మెదడు పరిణామాన్ని ప్రోత్సహించేవిగా ఉంటాయి. కానీ పక్షులతో పోల్చితే చురుకుదనం తక్కువగా ఉంటుంది.

Also Read: రోజూ ఎక్కువగా నీరు తాగడం కూడా ప్రమాదమేనా?

Advertisement

Next Story