A sign of good health : ఆరోగ్యంగానే ఉన్నారా?.. ఈ సంకేతాలే చెప్తాయ్!

by Javid Pasha |   ( Updated:2024-07-24 15:51:48.0  )
A sign of good health : ఆరోగ్యంగానే ఉన్నారా?.. ఈ సంకేతాలే చెప్తాయ్!
X

దిశ, ఫీచర్స్ : సడెన్‌గా శరీరం వేడెక్కిందా? అయితే ఫీవర్ కావచ్చు. గొంతులో ఏదో తేడాగా అనిపిస్తోందా? టాన్సిల్స్ లేదా ఇన్ఫెక్షన్ అయి ఉండవచ్చు. రోజుల తరబడి జలుబు తగ్గడం లేదా? ఇమ్యూనిటీ పవర్ అంతగా లేకపోవచ్చు.. ఇలా తరచుగా మన శరీరంలో కనిపించే కొన్ని లక్షణాలు లేదా సంకేతాలు అనారోగ్యకరమైన మార్పులను సూచిస్తుంటాయి అనే విషయం తెలిసిందే. కానీ మీరు ఆరోగ్యంగా ఉన్నారనడానికి ఏది సంకేతం? హెల్తీగా ఉన్నవారి బాడీలో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? గుడ్ హెల్త్‌కు సంబంధించిన ఫీల్ ఎలా ఉంటుంది? దీనిపై ఆరోగ్య నిపుణులు ఏం చెప్తు్న్నారో చూద్దాం.

విశ్రాంతి, స్థిరమైన నిద్ర

నిద్ర మానవ జీవితానికి చాలా ముఖ్యమైన బయోలాజికల్ ఫంక్షన్. ఆరోగ్యానికి ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే అవసరం. అలసట, ఒత్తిడి, వివిధ అనారోగ్యాలను నివారించడంలో అవసరమైన విశ్రాంతి, నిద్ర కీలకపాత్ర పోషిస్తాయి. కాబట్టి మీరు తగినంత విశ్రాంతి, స్థిరమైన నిద్ర విధానాన్ని కలిగి ఉండటం మొత్తం శ్రేయస్సును సూచిస్తుందని నిపుణులు చెప్తున్నారు. అయితే ఇక్కడ మధ్యాహ్నం పూట నిద్ర కూడా ముఖ్యం అనుకోవద్దు. అది అవసరం లేదు కూడా. అయితే అప్పుడప్పుడూ మీకు మధ్యాహ్న సమయంలో కూడా నిద్ర ముంచుకు రావడం కూడా మీ అడ్రినల్ పనితీరుకు, రక్తంలో స్థిరమైన చక్కెర స్థాయిలకు నిదర్శనం.

గుడ్ ఎనర్జీ లెవల్స్

మంచి ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం ముఖ్యం. అయితే మీరు ఎటువంటి నొప్పి లేదా అసౌకర్యం లేకుండా రోజువారీ యాక్టివిటీస్‌లో పాల్గొనే ఫిజికల్ యాక్టివిటీస్‌ కలిగి ఉండటంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇలాంటి శారీరక శ్రమను కలిగి ఉన్నప్పుడు శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటారు. గుడ్ ఎనర్జీని కలిగి ఉన్న అనుభూతిని చెందుతున్నారంటే మీరు ఆరోగ్యంగా ఉన్నట్లే అంటున్నారు నిపుణులు. ఎప్పుడైతే ఫిజికల్ యాక్టివిటీస్‌కు దూరం అవుతారో ఎనర్జీ లెవల్స్‌లో తగ్గుదల కనిపిస్తుంది.

ఆరోగ్యకరమైన ప్రేగు కదలికలు

మీరు ఆరోగ్యకరమైన ప్రేగు కదలికలను అనుభవిస్తుంటే హెల్తీగా ఉన్నారని అర్థం. డైలీ కనీసం రెండుసార్లు యూరిన్‌కు పోవడం, ఈ సందర్భంగా ఎటువంటి సమస్యలు లేకపోవడం వంటి సంకేతాలు మీ ప్రేగుల్లో సమస్యలు లేవని చెప్పడానికి అవసరమైన సంకేతాలుగా భావించవచ్చునని నిపుణులు చెప్తున్నారు. అలా కాకుండా కడుపులో ప్రేగులు పట్టినట్లు అనిపించడం, తరచుగా ఉబ్బరం, ఏదైనా అసౌకర్యం అనుభవిస్తుంటే.. డైజెస్టివ్ డిజార్డర్స్ ఉన్నట్లు అనుమానించవచ్చు.

యూరిన్ సిస్టమ్ ‌పనితీరు

మూత్ర విసర్జన సందర్భంగా నొప్పి లేకుండా, మూత్రం రంగు తరచుగా మారడం వంటివి జరగకుండా పాస్ అయినట్లయితే మీరు హెల్తీ యూరినల్ సిస్టం కలిగి ఉన్నారని, హైడ్రేటెడ్‌గా ఉన్నారని, కిడ్నీలు సక్రమంగా పనిచేస్తున్నాయని చెప్పడానికి సరైన సంకేతంగా ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

ఆరోగ్యకరమైన చర్మం

మానవ శరీరంలో స్కిన్‌ను నిపుణులు లార్జెస్ట్ ఆర్గాన్‌గా పేర్కొంటారు. ఇది శరీరానికి రక్షణగా ఉంటుంది. ముఖ్యంగా ముఖంపై, మెడపై చర్మం ఎలా ఉందనే దానిని బట్టి మొత్తం ఆరోగ్యం గురించి అంచనా వేయవచ్చునని చర్మ వ్యాధి నిపుణులు చెప్తుంటారు. ముఖంపై, మెడ‌పై చర్మం హైట్రేటెడ్‌గా ఉండటం మీరు ఆరోగ్యంగా ఉన్నారనడానికి సంకేతం. అలాగే ఆరోగ్యవంతమైన చర్మం కోసం తగిన జాగ్రత్తలు కూడా అవసరం. ఎండలో ఎక్కువసేపు ఉండాల్సి వస్తే ఉపశమనం కలిగించే దుస్తులు, సన్ స్ర్కీన్ వంటివి వాడవచ్చు.

ఒత్తైన జుట్టు

మీ తల వెంట్రుకలు థిక్‌గా, సమృద్ధిగా లేదా మందంగా ఉన్నాయంటే మీరు ఆరోగ్యంగా ఉన్నారనడానికి సంకేతం. అదే సన్నని లేదా పెళుసుగా ఉండే జుట్టు కలిగి ఉండటం కొన్నిసార్లు విటమిన్లు, ఖనిజాల లోపం కూడా కావచ్చునని నిపుణులు చెప్తున్నారు.

ఓరల్ హెల్త్

నోటి ఆరోగ్యం అనేది వాస్తవానికి ప్రతిరోజూ పళ్లు తోముకోవడం వంటి సాధారణ జీవనశైలి అలవాట్లను అనుసరించడంపై ఆధారపడి ఉంటుంది. మీ దంతాల చిగుళ్లు గులాబీ రంగులో ఉండి, దృఢంగా, బలంగా ఉన్నట్లు భావిస్తే మీ ఓరల్ హెల్త్ బాగున్నట్లు. దంతాల ఆరోగ్యానికి నోటి పరిశుభ్రత చాలా ముఖ్యం. అలాగే ఏ ఇబ్బంది లేకుండా తాజా శ్వాస తీసుకుంటున్నారంటే మీ నోటి ఆరోగ్యం, గట్ హెల్త్ సమతుల్యంగా ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ దుర్వాసనతో కూడిన శ్వాస కలిగి ఉంటే అనారోగ్యానికి సంకేతం.

రెగ్యులర్ మెన్‌స్ట్రువల్ సైకిల్

మహిళలు రెగ్యులర్ రుతుక్రాన్ని కలిగి ఉండటం గుడ్ హెల్త్‌కు సంకేతమని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. హార్మోన్లు సమతుల్యంగా ఉండటంవల్ల మాత్రమే ఇలా జరుగుతుంది. అదే రుతు చక్రంలో ఇబ్బందులు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీరియడ్స్ తీవ్రమైన సమస్యలు కానప్పటికీ, కొన్నిసార్లు అనారోగ్యానికి సంకేతం కూడా కావచ్చు.

బ్రెయిన్ ఫంక్షన్

ముఖ్యమైన విషయాలను గుర్తుకు ఉండటం, ఏకాగ్రతను, జ్ఞాపక శక్తిని కలిగి ఉండటం ఆరోగ్యకరమైన మెదడు పనితీరుకు నిదర్శనం. హెల్తీ బ్రెయిన్ ఫంక్షన్ కలిగి ఉన్నప్పుడే మానసిక, శారీరక ఆరోగ్యం బాగుంటుంది. సమర్థవంతమైన కమ్యూనికేట్ చేయగలుగుతారు. హెల్తీ లైఫ్ స్టైల్ కలిగి ఉండటం మొత్తం ఆరోగ్యంతోపాటు మీ మెదడు ఆరోగ్యానికి కూడా మంచిదని నిపుణులు చెప్తున్నారు.

గుండె ఆరోగ్యం

మీరు హెల్తీ హార్ట్ కలిగి ఉంటేనే.. ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే శరీరం అంతటికీ ఆక్సిన్‌ను, రక్తాన్ని ఫిల్టర చేసి పంపడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అవయవాలన్నీ సరిగ్గా పనిచేయడానికి అవసరమైన పోషకాలను రక్త ప్రసరణ వ్యవస్థ ద్వారా అందిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే డిఫెక్టివ్ హార్ట్ అనేది ప్రాణాంతకం.

రోగ నిరోధక వ్యవస్థ

మానవ ఆరోగ్యానికి రోగ నిరోధక వ్యవస్థ చాలా ముఖ్యం. హానికారక వైరస్‌లు, బగ్‌లు, పరాన్న జీవుల నుంచి రక్షించడానికి, ఇన్ ఫెక్షన్లతో పోరాడటానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ ఫ్రంట్ లైన్ రక్షణ అనేక అనారోగ్యాలను నివారిస్తుంది. మీరు చిన్న చిన్న గాయాలు, అనారోగ్యాలను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారంటే.. మీలో రోగ నిరోధక వ్యవస్థ పనిచేస్తున్నట్లు అర్థం. అలాగే జలుబు, ఒళ్లు నొప్పులు, తలనొప్పులు వంటివి వచ్చినప్పుడు కాసేపటికో, ఒక రోజు తర్వాతో సహజంగానే తగ్గిపోతున్నాయంటే మీలో ఇమ్యూనిటీ పవర్ బాగా ఉందని సంకేతం.

Read more...

Smart phone : మొబైల్ స్క్రీన్‌కు మన కళ్ళను ఎందుకు దగ్గరగా ఉంచకూడదు?


Advertisement

Next Story

Most Viewed