నాలుక రంగును బట్టి కెరీర్.. మనిషి వ్యక్తిత్వాన్ని తెలిపే టంగ్..

by Sumithra |   ( Updated:2023-06-26 15:10:09.0  )
నాలుక రంగును బట్టి కెరీర్.. మనిషి వ్యక్తిత్వాన్ని తెలిపే టంగ్..
X

దిశ, వెబ్‌డెస్క్ : డాక్టర్లు రోగుల నాలుకను చూసి వారి ఆరోగ్య పరిస్థితులను గురించి తెలుసుకుంటారు. కానీ మనిషి నాలుక ఆకారాన్ని బట్టి, రంగును బట్టి ఎవరికి ఎంత అదృష్టం కలుగుతుందో తెలుసుకోవచ్చని కొంత మంది జ్యోతిష్కులు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు అరచేతిలో గీతల ద్వారా వారి భవిష్యత్తును తెలుసుకోవచ్చని మాత్రమే తెలుసు. కానీ నాలుక రంగు, ఆకారం ద్వారా కూడా ఉద్యోగం, వ్యాపార రంగాలలో వారు ఎలా ఎదుగుతారో తెలుసుకుంటారు. అయితే వ్యక్తిగత లక్షణాలు, మనిషి కెరియర్ ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాలను ఎలా తెలుసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

నాలుక నలుపు రంగులో..

కొంతమంది నాలుక చూడడానికి నలుపురంగులో చాలా పొడవుగా ఉంటుంది. ఇలా నాలుక నల్లరంగులో ఉన్నవారు ఏ వ్యాపారాన్ని కుదురుగా చేయకుండా తరచుగా మారుస్తూ ఉంటారు. అంతే కాదు వారు చేసే ప్రతిపనిలోనూ అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారట. ఈ రకమైన వ్యక్తులు ఉద్యోగాలు చేసేందుకు ఎక్కువగా ఇష్టపడతారు.

నాలుక పసుపు రంగులోఉంటే..

హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం నాలుక పసుపురంగులో ఉంటే వారు ఎప్పుడూ అనారోగ్యంగా ఉంటారు. వీరికి శక్తి కూడా క్షీణిస్తూ ఉంటుంది. అంతేకాదు వీరికి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా వస్తాయి. అందుకే మీలో ఎవరి నాలుకైనా పసుపురంగులో మారుతూ ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

నాలుక మందంగా ఉంటే..

నాలుక మందంగా ఉన్నవారు కాస్త కఠినంగా మాట్లాడతారట. స్వతహాగా వీళ్లు మంచివారే అయినప్పటికీ వారు మాట్లాడే శైలితో ఎదుటివారికి శత్రువుల్లా మిగిలిపోతారు. అందుకే వీళ్లు తమ మాటలను అదుపులో పెట్టుకుని, ఆలోచించి, ఆచితూచి మాట్లాడే ప్రయత్నం చేయాలి.

నాలుక వేర్వేరు రంగులలో ఉంటే..

ఎవరి నాలుకైనా ఒకేరకంగా ఉండకుండా వేర్వేరు రంగులలో ఉంటే ఆ వ్యక్తులు చెడు సహవాసాల బాట పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటుందట. వీళ్లు ఎప్పుడూ రూల్స్‌ను బ్రేక్ చేస్తూనే ఉంటారు. మరోవైపు వీళ్లు అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇకపోతే వీరు ఎలాంటి నియమనిబంధనలను పాటించడానికి ఇష్టపడరు.

నాలుకకు ఎరుపు రంగులో ఉండి, పుట్టుమచ్చలుంటే..

ఎవరి నాలుక అయితే ఎర్రగా సన్నగా ఉంటుందో వీరు ఎక్కువగా విజయాలను సాధిస్తారు. వీరు మంచి దౌత్యవేత్తలు కావొచ్చు. నాలుకపై పుట్టుమచ్చ ఉన్నవారు మంచి వ్యక్తులుగా సమాజంలో జీవిస్తారు. కొన్నిసార్లు వీరు చాలా నిర్లక్ష్య ధోరణిలోఉంటారు. వీరు చేసే కొన్ని తొందరపాటు పనుల కారణంగా వారు నష్టపోవాల్సి వస్తుంది. వీరు ఉన్నత స్థానాలకు త్వరగా చేరుకుంటారు. వీరి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.

Read More..

టెన్షన్‌లో చెమటలు వస్తున్నాయా..? అయితే ఇది మీ కోసమే..!

వేసవిలోనే కాదు.. వర్షాకాలంలో చూడాల్సిన ప్రదేశాలు ఇవే.. అస్సలు మిస్ కావద్దు!

Advertisement

Next Story