- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రైమ్ షోలను చూసేవారు నేరస్థులుగా మారుతారా?.. నిపుణులు ఏం చెప్తున్నారంటే..
దిశ, ఫీచర్స్ : తరచూ క్రైమ్ షోలు చూడటం, కంటెంట్ చదవడం మనుషుల్లో నేర స్వభావాన్ని ప్రేరేపిస్తుందని కొందరు చెప్తుంటారు. కానీ ఇది వాస్తవం కాదని 2000 మందిపై వన్‌పోల్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. పైగా 76 శాతం మంది నేర సమాచారాన్ని తెలుసుకోవడంవల్ల రియల్ లైఫ్‌లో ప్రమాదకర సందర్భాలను ఎదుర్కోనే నైపుణ్యాన్ని కలిగి ఉంటారని నిపుణులు చెప్తున్నారు. అయితే ట్రూ క్రైమ్ ఫ్యాన్స్ ఆయా సందర్భాల్లో ఇతరులను ఎక్కువగా అనుమానించే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారని రిక్రియేషనల్ ఫియర్ ల్యాబ్‌లోని రీసెర్చ్ సైంటిస్ట్ కోల్టన్ స్క్రివ్‌నర్ తెలిపారు.
క్రైమ్ కంటెంట్ పట్ల ప్రజలు ఎక్కుకవగా అట్రాక్ట్ అవడం వెనుక ప్రమాదకర పరిస్థితులతో, వ్యక్తులతో అప్రమత్తంగా ఉండవచ్చనే ప్రాథమిక ఆలోచన కూడా ఉంటుందని సర్వే పేర్కొన్నది. డేంజరస్ వ్యక్తుల గురించిన క్యూరియాసిటీ దాదాపు మూడు లక్షల సంవత్సరాల క్రితం స్టార్ట్ అయి ఉండవచ్చని తెలిపింది. అయితే ప్రస్తుతం క్రైమ్ షోలు ప్రజలకు సమస్యగా మారుతున్నాయనే వాదన కూడా ఉంది. వాటిని వీక్షించడం, వినడం ద్వారా అప్రమత్తమైన ఆలోచనలు కలుగవచ్చునేమో కానీ, ఒక నేరం చేయడానికి అవసరమైన ఐడియా, ప్రేరణ కూడా కలుగుతుందనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. తాజా సర్వేను ఎనలైజ్ చేసిన నిపుణులు మాత్రం అందుకు భిన్నంగా స్పందిస్తున్నారు. నిజమైన నేర సమాచారం, క్రైమ్ షోలల్లో మానవులు నేర్చుకోవాల్సిన కోణం ఉంటుందని నమ్ముతున్నారు. దీనివల్ల నిజ జీవితంలో ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొనే నైపుణ్యం ఏర్పడుతుందని చెప్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 75 శాతం మంది తాజా క్రైమ్ స్టోరీలను చూసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు పేర్కొంటున్నారు. అలాగే క్రైమ్ కంటెంట్ చూసే ప్రతీ పది మందిలో ఏడుగురికిపైగా ఆయా వ్యక్తులను ఎక్కువగా అనుమానిస్తున్నట్లు వెల్లడించారు.
Read More: కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు పాము కాటుకు ఎక్కువగా గురవుతుంటారు.. కారణం ఏంటో తెలుసా?