- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారానికి 6 గంటలే కలిసి ఉంటున్న కుటుంబాలు.. కారణం ఏంటో తెలుసా?
దిశ, ఫీచర్స్: బిజీ లైఫ్‌లో ఏ మాత్రం అవకాశం దొరికినా తమ విలువైన సమయాన్ని ఫ్యామిలీతో గడపాలని కోరుకుంటారు భారతీయులు. కుటుంబ సమేతంగా కలిసి భోజనం చేయడం వల్ల ప్రతీ ఒక్కరిపై పాజిటివ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూపించే పరిశోధనలు కూడా చాలానే ఉన్నాయి. అత్యధిక మంది అలా చేస్తుంటారు కూడా. కానీ అలాంటి కోరికలున్నప్పటికీ డైలీ ఫ్యామిలీతో స్పెండ్ చేసే క్వాలిటీ టైమ్ బ్రిటన్, అమెరికా, లండన్, ఆస్ట్రేలియాతోపాటు వివిధ పారిశ్రామిక దేశాల్లో ఉండటం లేదని, వివిధ పనులు, డిజిటల్ పరికరాలు, స్ర్కీన్‌లు వంటి అనేక పరిస్థితులు అందుకు ఆటంకంగా మారుతున్నాయని ఒక అధ్యయనంలో పేర్కొన్నది. ఈ విధమైన కారణాలతో చాలా కుటుంబాలు వారంలో కేవలం 6 గంటలు మాత్రమే కలిసి గడుపుతున్నాయని సర్వేలో తేలింది.
ఇంట్లో పిల్లలతో కలిసి ఉంటున్న 2,000 మంది బ్రిటీష్ తల్లిదండ్రులపై మెక్‌కెయిన్ ఫుడ్స్ తరపున వన్‌పోల్ నిర్వహించిన స్టడీ ప్రకారం వర్క్ షిఫ్టులు ఫ్యామిలీతో స్పెండ్ చేసే క్వాలిటీ టైమ్‌ను 56 శాతం వరకు అడ్డుకుంటున్నాయని వెల్లడైంది. ఇక హోంవర్క్ 29 శాతం, ఇంటి పనులు 27 శాతం, టీవీ చూడటంవల్ల 21 శాతం, సోషల్ మీడియా వినియోగంవల్ల 20 శాతం, ఆఫ్టర్ స్కూ్ల్ యాక్టివిటీస్ వల్ల 19 శాతం కుటుంబంతో కలిసి గడిపే అవకాశాన్ని దూరం చేస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇక కుటుంబ సభ్యులంతా ఒకే ఇంట్లో ఉన్నప్పుడు కూడా 37 శాతం మంది తాము ఒకరితో ఒకరు గడపడానికి నిర్దిష్ట సమయాన్ని కేటాయించడం లేదని తెలిపారు. సగం మంది రెస్పాండెంట్స్ ఇండ్లల్లో ఉంటున్నప్పటికీ సరదాగా కలిసి మాట్లాడుకునే అవకాశాలను తగ్గించడంపై స్క్రీన్లతో కూడిన పరికరాలు ప్రభావం చూపుతున్నాయని వెల్లడించారు.
ఈ విధమైన పరికరాల వల్ల 42 శాతం మంది పేరెంట్స్ తమ పిల్లలతో కలిసి భోం చేయడానికి ఇబ్బంది పడాల్సి వస్తోందట. అందుకే నాలుగో వంతు మంది తల్లిదండ్రులు తమ పిల్లలను భోజన సమయంలో పరస్పరం కలిసి మాట్లాడటాన్ని ప్రోత్సహిస్తున్నారని సర్వే పేర్కొన్నది. భోజన సమయాలను పక్కన పెడితే 57 శాతం మంది పేరెంట్స్ తమ పిల్లలతో కారులో వెళ్తున్నప్పుడు, 40 శాతం మంది పిల్లలను పడుకోపెడుతున్నప్పుడు, 38 శాతం మంది తమ పిల్లలను స్కూల్‌కి తీసుకెళ్లేటప్పుడు-తిరిగి తీసుకొచ్చేటప్పుడు వారితో కలిసి కబుర్లు చెప్తుంటారని సర్వేలో వెల్లడైంది. ఇక పేరెంట్స్ ఏ విధమైన యాక్టివిటీస్‌ను నాణ్యమైన కుటుంబ సమయంగా భావిస్తారని పరిశీలించినప్పుడు కలిసి భోజనం చేయడాన్నే అత్యధికంగా 74 శాతం మంది ఇష్టపడుతున్నారు. 66 శాతం మంది కలిసి టీవీ చూడటంవల్ల, 46 శాతం మంది వంట చేసే సమయంలో తమ క్వాలిటీ టైమ్‌ను పిల్లలతో స్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read..
మహిళల్లోనే ఆ రిస్క్ ఎక్కువ.. కార్పొరేట్ సెక్టార్ ఉద్యోగులపై సర్వేలో వెల్లడి