- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sleep సామర్థ్యంపై టెంపరేచర్ ఎఫెక్ట్.. 10 శాతం తగ్గినా ప్రమాదమే
దిశ, ఫీచర్స్: మారుతున్న పర్యావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు వ్యక్తుల నిద్రపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని యూఎస్‌లోని బోస్టన్‌లో పలువురు వాలంటీర్లపై నిర్వహించిన ఒక అధ్యయనం పేర్కొన్నది. ముఖ్యంగా హీట్ వెదర్ వరల్డ్‌వైడ్ అనేక మందిలో నిద్రకు అంతరాయం కలిగిస్తోందని, చాలా తక్కువ నిద్రకు, నిరాశకు కారణం అవుతోందని పేర్కొన్నారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా రాత్రి సమయాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతల ఎఫెక్ట్‌తో 2099 నాటికి ప్రతీ వ్యక్తి సంవత్సరానికి 50 గంటల నిద్రను కోల్పోయే ప్రమాదం ఉందని పరిశోధకులు చెప్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు పగలు లేదా రాత్రిపూట హీట్‌వేవ్ కారణంగా ఎక్కువగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.
చిన్న పిల్లలు లేదా 60 ఏళ్లు పైబడిన వారు ప్రశాంతంగా నిద్రపోవడానికి ఉష్ణోగ్రత పరిధి 20 నుంచి 25 °C (68 నుంచి 77 °F) మధ్య ఉండాలని నిపుణులు అంటున్నారు. అయితే ఇవి 25 °C నుంచి 30 °Cకి పెరిగినప్పుడు నిద్ర సామర్థ్యం 10 శాతం తగ్గుతుందని, ఇది దీర్ఘకాలం కొనసాగితే మెదడు పనితీరును దెబ్బతీస్తుందని చెప్తున్నారు. దీంతోపాటు ఒత్తిడి, ఆందోళన, అలసటను పెంచుతుంది.
మరుసటి రోజు శరీరంలోని బ్లడ్ షుగర్ లెవల్‌పై నెగెటివ్ ఎఫెక్ట్ చూపుతుంది. భూ గ్రహం వేడెక్కుతున్న కొద్దీ రాత్రులు వేడెక్కుతున్నందున నివాసాల ఉష్ణ సౌకర్యాన్ని మెరుగుపరచడానికి, ముఖ్యంగా వృద్ధుల సంరక్షణపై ఈ కొత్త అధ్యయనం ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. రిఫ్లెక్టివ్ పెయింట్స్, అందర్ బిల్డింగ్ మెటీరియల్ వంటి ఎయిర్ కండిషనింగ్‌కు మించిన పరిష్కారాలను కనుగొనడంపై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని, పర్యావరణానికి ముప్పు కలిగించే చర్యలకు అన్ని దేశాలు, ప్రజలు స్వస్తి పలకాలని నిపుణులు చెప్తున్నారు.
ఇవి కూడా చదవండి : మీరు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలా?.. ‘ఫీల్ గుడ్ స్లీప్’ హెల్ప్ అవుతుంది!