సమాజంతో సంబంధంలేకుండా ఉంటున్నారా?.. ఈ సమస్యలు తప్పవు !

by Prasanna |   ( Updated:2023-05-15 06:07:00.0  )
సమాజంతో సంబంధంలేకుండా ఉంటున్నారా?.. ఈ సమస్యలు తప్పవు !
X

దిశ, ఫీచర్స్ : మీరెప్పుడైనా వారం రోజులపాటు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా గడిపిన సందర్భాలున్నాయా? ఎవరితోనూ మాట్లాడకుండా ఒక నెలరోజులు ఉండగలరా? అసాధ్యం అనిపిస్తోంది కదూ! అంతేకాదు, అలా ఉండటం శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఒక అధ్యయనం పేర్కొన్నది. సోషల్ ఐసోలేషన్ అనేది వ్యక్తిని కృంగదీస్తుందని, కోవిడ్ మహమ్మారి సమయంలో చాలామంది ఈ పరిస్థితిని అనుభవించారని నిపుణులు చెప్తున్నారు.

నిజానికి మానవులు ‘సోషల్ ఎనిమల్స్’ అని సైన్స్ చెప్తుంది. మన చుట్టూ ప్రజలతో కలిసి మెలిసి ఉండటంవల్ల మనం అభివృద్ధి చెందుతాం. అవగాహన ఏర్పడుతుంది. అనుభవాలతో గుణపాఠాలు నేర్చుకుంటాం. కానీ సామాజిక ఒంటరితనం(social isolation) మాత్రం మనుషులను శారీరక, మానసిక బలహీనతలకు గురిచేస్తుంది. అందుకే సోషల్ ఐసోలేషన్‌ను చాలా కాలంగా జైళ్లలో శిక్షగా ఉపయోగించబడుతోంది. ఆహారం తీసుకోకుండా ఉన్నప్పుడు మనుషుల్లోని ఎనర్జీ లెవల్స్‌ ఎలా తగ్గుతాయో, అచ్చం అలాగే సామాజిక ఒంటరి తనం కూడా ప్రభావం చూపుతుందని, మనుషుల్లో మానసిక, శారీర ఆరోగ్యాలకు సంబంధించిన బలహీనతలు, రుగ్మతలు సంభవిస్తాయని పరిశోధకులు అంటున్నారు.

యూనివర్సిటీ ఆఫ్ వియన్నాకు చెందిన పరిశోధకులు 8 గంటలపాటు సామాజికంగా ఒంటరిగా ఉండటం అనేది వ్యక్తులపై హానికరమైన ప్రభావాలను చూపుతుందని కనుగొన్నారు. అధ్యయనంలో భాగంగా పరిశోధకులు 30 మంది వాలంటీర్లను పరిశీలించారు. వారిని మూడు వేర్వేరు రోజులలో, సామాజిక సంబంధాలు లేకుండా(social isolation), ఆహారం లేకుండా ఒంటరిగా 8 గంటలపాటు గడిపేలా చేశారు. ఈ విధమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ 30 మంది రోజంతా మానసిక ఒత్తిడిని, తీవ్రమైన అలసటను ఉన్నట్లు గుర్తించారు. హృదయ స్పందన రేటులో మార్పులను, శారీరక, మానసిక రుగ్మతలకు కారణమయ్యే కార్టిస్టాటిల్ హార్మోన్ మెదడుపై ప్రభావం చూపడాన్ని నమోదు చేశారు. దీంతోపాటు 2020లో ఆస్ట్రియా, ఇటలీలలో లాక్ డౌన్ సమయంలో సామాజిక ఒంటరితనం ప్రభావంపై నిర్వహించిన మరో అధ్యయన ఫలితాలతో కూడా పోల్చారు. అప్పట్లో కనీసం 8 గంటలపాటు ఒంటరిగా గడిపిన 87 మంది డేటాను సేకరించి, ఒత్తిడి, ప్రవర్తనలను అంచనా వేశామని పరిశోధనకు నేతృత్వం వహించిన వియన్నా యూనివర్సిటీ ప్రొఫెసర్ సిలానీ పేర్కొన్నారు. ఈ రెండు అధ్యయనాలను పోల్చినప్పుడు కూడా సామాజిక ఒంటరితనం అనేది మనుషులను కృంగదీస్తుందని, అది మానసిక, శారీరక అనారోగ్యాలకు దారితీస్తుందని పరిశోధకులు కనుగొన్నారు.

Read more:

ట్వీట్లను బట్టి మెంటల్ డిజార్డర్స్‌ను గుర్తించవచ్చు.. పరిశోధనలో ముందడుగు

Advertisement

Next Story

Most Viewed