- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Viral video : అమ్మాయిలతో డాన్స్ చేస్తున్న కొడుకును తల్లి ఏం చేసిందో చూసి నవ్వుకోండి..
దిశ, వెబ్‌డెస్క్ : సరదాగా గడపాలని ఎవరు కోరుకోరు చెప్పండి. ప్రతి ఒక్కరికి ఆ కోరిక ఉంటూనే ఉంటుంది. ఒకరు తన కుటుంబంతో లాంగ్ డ్రైవ్‌కు వెళ్లాలనుకుంటే, మరికొంతమంది పార్టీ కోసం తన స్నేహితులతో కలిసి రెస్టారెంట్‌కి వెళుతుంటారు. అయితే కొంతమంది మాత్రం కుటుంబసభ్యులకు, స్నేహితులకు దూరంగా ఒంటరిగా ఉండి పార్టీ చేసుకునేందుకు రెస్టారెంట్‌కు వెళ్లుతుంటారు. అక్కడ తమకు నచ్చిన అమ్మాయితో కలిసి డ్యాన్స్ చేస్తూ మద్యం సేవించి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తుంటారు. అయితే ఇలా చేస్తున్నప్పుడు కొన్నిసార్లు కొన్ని ఫన్నీ మూమెంట్లు ఎదురవుతాయి. ఈరోజు అలాంటి ఒక వీడియోనే ఇప్పుడు మనం చూద్దాం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి ముగ్గురు అమ్మాయిలతో కలిసి డ్యాన్స్ చేయడాన్ని మీరు చూడవచ్చు. తెల్లటి దుస్తుల్లో కనిపిస్తున్న అందగత్తెని వేళ్లతో తిప్పుతున్నాడు వ్యక్తి. అదే సమయంలో ఇద్దరు అమ్మాయిలు పొట్టి ఎరుపు రంగు దుస్తులు ధరించి, మరొకరు మెరూన్ దుస్తులలో నిలబడి తమ వంతు కోసం ఎదురు చూస్తున్నారు. వెనుక సోఫాలో ఒక వ్యక్తి కూడా కూర్చున్నాడు. అతని పక్కన ఒక అమ్మాయి కూర్చుని వీడియో చేస్తోంది. అందరూ తమ తమ సరదాల్లో మునిగిపోయారు. అయితే రష్యన్ అమ్మాయిలతో కలిసి డ్యాన్స్ చేస్తున్న అబ్బాయికి అకస్మాత్తుగా వెనుక నుంచి ఇబ్బంది వచ్చింది. అది మరెవరో కాదు ఈ వ్యక్తి తల్లి. లిఫ్ట్ లోంచి బయటకు రాగానే అబ్బాయిని చూసింది. ఆమె వెంటనే చెప్పులు తీసుకొని అబ్బాయిని తీవ్రంగా కొట్టడం ప్రారంభించింది. అబ్బాయి కోటు కూడా పోతుంది. కానీ సోఫాలో కూర్చున్న వారు పట్టించుకోలేదు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో బిలియనీర్స్ చాప్టర్స్ (@billionairechapters_) షేర్ చేశారు. ఇది కొద్ది సేపటికే వైరల్ అయింది.
Video credit by @billionairechapters