నెలకు రూ. 6 కోట్ల జీతం.. ఇల్లు కూడా ఫ్రీ.. అయినా ఆ జాబ్ చేయడానికి ఎవరూ ఇష్టపడట్లేదట!

by Javid Pasha |
నెలకు రూ. 6 కోట్ల జీతం.. ఇల్లు కూడా ఫ్రీ.. అయినా ఆ జాబ్ చేయడానికి ఎవరూ ఇష్టపడట్లేదట!
X

దిశ, ఫీచర్స్ : ఈరోజుల్లో అసలు జాబ్ దొరకడమే కష్టం. ఒక వేళ దొరికినా హయ్యర్ సాలరీస్ పొందడం అంతకంటే కష్టం. ఇక అప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా.. కొందరు తమకు పనికి తగిన వేతనం రావడం లేదని చెప్తుండటం చాలా కామన్ అయిపోయింది. ఇంకొందరు ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోయినా, సరిపడా సాలరీ వచ్చినా.. రాకున్నా ఆర్థిక ఇబ్బందులు, సమాజంలో గౌరవం వంటి ఉద్దేశాలు, కారణాలతో ఉద్యోగాలు చేస్తుంటారు. అంతేకాకుండా ఎక్కడ ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాలు దొరుకుతాయోనని ఎదురు చూస్తుంటారు. అధిక వేతనం ఇచ్చే కంపెనీల్లో అవకాశం వస్తే వెంటనే అక్కడికి జంప్ అవుతుంటారు. కానీ ఒకచోట మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా జరుగుతోంది.

తమ వద్ద ఖాళీగా ఉన్న ఓ పోస్టుకు దరఖాస్తు చేసి, ఉద్యోగంలో జాయిన్ అయితే నెలకు రూ.6 కోట్లు ఇస్తామని అక్కడి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ప్రకటించినా, రిక్వెస్ట్ చేసినా ఎవరూ ఆ జాబ్ కోసం దరఖాస్తు చేయడానికి ముందుకు రావడం లేదట. ఇంతకీ ఆ ఉద్యోగం ఏమిటి? ఎక్కడ? అనుకుంటున్నారా? ఇక వివరాల్లోకి వెళ్దాం.. అది పశ్చిమ ఆస్ట్రేలియాలోని కారాడింగ్ అనే చిన్న పట్టణం. ఇక్కడి జనాభాలో అత్యధిక మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుంటారు. పెద్ద పెద్ద నగరాలకు వెళ్లి ఉద్యోగాలు చేయడానికి అయితే ఎవరూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపరట. ప్రముఖ వెబ్‌సైట్ news.com.au రిపోర్ట్ ప్రకారం.. ఈ పట్టణంలో ప్రజలకు ఏదైనా అనారోగ్యం చేస్తే ఒక్క డాక్టర్ కూడా అందుబాటులో లేడు. గతంలో ఒకతను ఉంటే కాంట్రాక్ట్ ముగియగానే మానేశాడు. మళ్లీ రమ్మంటే రావడం లేదు. ఇందుకు కారణం కారాడింగ్ పట్టణం ఇతర నగరాలకు, గ్రామాలకు చాలా దూరంలో ఉండటమే.

కొత్తగా ఇంకెవరైనా వస్తారేమోనని పట్టణ పరిపాలనా అధికారులు ఏడాది కిందటే ఉద్యోగ ప్రకటన విడుదల చేశారు. అయినా ఎవరూ రావడం లేదట. దీంతో అధికారులు తమ పట్టణంలో ఎవరైనా డాక్టర్ పోస్టుకు దరఖాస్తు చేసుకుంటే.. ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండానే జాయిన్ చేసుకుంటామని, పైగా నెలకు ఒక మిలియన్ డాలర్లు (ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 6 కోట్లు) ఇస్తామని ప్రకటించారు. దీంతోపాటు ఉండటానికి ఉచిత ఇల్లు, ఇతర సౌకర్యాలు కూడా కల్పిస్తామని స్పష్టం చేశారు. అయినా ఆ జాబ్ చేయడానికి ఇప్పటి వరకూ ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రజెంట్ ఈ న్యూస్ వైరల్ అవుతుండగా.. ఇది విన్నవారంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed