- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సింగర్స్ వాయిస్‌ను నియంత్రిస్తున్న పరికరం..
దిశ, ఫీచర్స్: సాధారణంగా సింగర్స్, పబ్లిక్ స్పీకర్స్, టీచర్స్, యాంకర్స్ ఎక్కువగా మాట్లాడాల్సి ఉంటుంది. అంటే తమ వోకల్ కార్డ్స్‌ను ఎక్కువగా వినియోగించాల్సి ఉంటుంది. అయితే ఎక్కువగా యూజ్ చేస్తే స్వరపేటిక దెబ్బతినే ప్రమాదం ఉంది. ఒక్కోసారి వాయిస్ కూడా రాని పరిస్థితి నెలకొంటుంది. అలాంటి ప్రమాదాన్ని నివారించేందుకు ఓ పరికరాన్ని తయారు చేశారు శాస్త్రవేత్తలు. వాయిస్ ప్రమాదకరస్థితికి చేరుకున్నప్పుడు హెచ్చరికలు చేయడం ద్వారా ఈ డివైజ్ పనిచేస్తూ.. వారి వాయిస్‌ను కాపాడుతుంది.
నార్త్‌వెస్టర్న్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ జాన్ ఎ. రోజర్స్ నేతృత్వంలోని మెటీరియల్ సైంటిస్టులు, బయోమెడికల్ ఇంజనీర్లు, ఒపెరా సింగర్‌లు, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పాథాలజిస్టులు ఈ డివైజ్ డెవలప్ చేశారు. రెండు పరికరాలు కలిగిన డివైజ్ సెటప్‌ను అభివృద్ధి చేయగా.. ఇందులో ఒకటి యూజర్స్ స్టెర్నమ్‌పై చర్మానికి అతుక్కొని ఉండే సెన్సార్ కాగా, మరొకటి మణికట్టుపై ధరించే హాప్టిక్ ఫీడ్‌బ్యాక్ యూనిట్. ఈ రెండు వైర్‌లెస్ డివైజ్‌లను బ్లూటూత్ ద్వారా వాటిని వినియోగించే వ్యక్తికి సంబంధించిన స్మార్ట్‌ఫోన్‌లోని యాప్‌కి లింక్ చేస్తారు.
యూజర్స్ స్కిన్‌పై ఉండే సెన్సార్ నిరంతరం సింగర్స్ ధ్వని లేదా స్వరాన్ని పర్యవేక్షించి, ప్రమాదం ఏర్పడితే హెచ్చరిస్తుంది. అది కేవలం యూజర్ శబ్దాలను, వాయిస్‌ను తప్ప బయటి శబ్దాలను ఏమాత్రం గ్రహించదు. పైగా డివైస్ యూజర్‌కు సంబంధించి, వాయిస్ వోకల్ రీడింగ్‌లను సెట్ చేయబడిన యాప్‌కి ఎప్పటికప్పుడు ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉంటుంది. ఈ డేటాను మెషిన్ లెర్నింగ్ బేస్డ్ అల్గారిథమ్‌లు ప్రాసెస్ చేస్తాయి. ఫ్రీక్వెన్సీ, వాల్యూమ్ వ్యాప్తి, టైమింగ్‌ను నిర్ధారిస్తాయి. ఆల్గారిథమ్‌లు పాటలకు, మాటలకు మధ్య తేడాను గుర్తించడంలో కూడా 95 శాతం కంటే ఎక్కువ కచ్చితమైనని టెక్ నిపుణులు చెప్తున్నారు.
హెచ్చరిక తర్వాత 20 నిమిషాల రెస్ట్..
ఇక ఈ ప్రాసెస్ చేసిన డేటాను నిర్దిష్ట పరిమితికి చేరితే.. హాప్టిక్ ఫీడ్‌బ్యాక్ యూనిట్ వైబ్రేట్ అయ్యేలా చేయడం ద్వారా యూజర్‌ను హెచ్చరిస్తుంది. అంటే వోకల్ కార్డ్స్‌కు రెస్ట్ ఇవ్వాలని, లేదా సైలెంట్‌గా ఉండాలని అర్థం. ఆ విధమైన ప్రమాద హెచ్చరిక తర్వాత 15 నుంచి 20 నిమిషాల రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అయితే యాప్‌లోని డిస్‌ప్లే వోకల్ యాక్టివిటీస్‌కు సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ను మాత్రమే యూజర్స్‌కు అందిస్తుంది. ప్రమాదం పొంచి ఉన్నప్పుడు రెస్టు తీసుకోవాలని సూచిస్తుంది తప్ప తన ఇష్టారీతిన యూజర్ చెప్పే విషయాన్ని అది రికార్డు చేయదు.
అవగాహన అవసరం..
ప్రజలు తమ వాయిస్‌ను ఏ మేరకు వినియోగించాలన్న విషయాన్ని తరచూ మర్చిపోతుంటారని వాయిస్ ఎక్స్ పర్ట్, నార్త్‌వెస్ట్రన్ లెక్చరర్ థెరిసా బ్రాంకాసియో తెలిపింది. అయితే సీజన్‌డ్ క్లాసికల్ సింగర్స్ తమ వాయిస్ వోకల్ వినియోగంపై అవగాహన, అనుభవాన్ని కలిగి ఉంటారు కాబట్టి వారు జాగ్రత్తగా ఉంటారు. కానీ కొందరు పాడుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు తమ గొంతు ఎంతసేపు బాగా పనిచేస్తుందనే విషయంపై అవగాహన కలిగి ఉండరు. ఇలాంటివారికి తమ వాయిస్ (స్వరం) వినయోగంపై అవగాహన కల్పించడానికి, స్వరం పడిపోయే పరిస్థితిని గుర్తించి హెచ్చరించడానికి నూతనంగా డెవలప్ చేసిన డివైస్ బాగా యూజ్ అవుతుందని టెక్ నిపుణులు చెప్తున్నారు.
ఇవి కూడా చదవండి:
బ్రీత్ హోల్డింగ్ టెక్నిక్.. కీలకపాత్ర పోషిస్తున్న కెమోరెసెప్టర్లు..