- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లి అయినప్పటికీ పరాయి వ్యక్తితో ఎఫైర్.. 46 శాతం మంది చేస్తున్న పని అదేనట.. డేటింగ్ యాప్ సర్వేలో షాకింగ్ విషయాలు
దిశ, ఫీచర్స్ : జీవితంలో పెళ్లిని ఒక పవిత్రమైన బంధంగా చూస్తారు. వివాహ బంధం ద్వారా ఒక్కటైన స్త్రీ, పురుషులు ఎన్ని కష్టాలు వచ్చినా లైఫ్‌లాంగ్ కలిసి జీవించడానికే మొగ్గు చూపుతారు. మనస్పర్థలు వచ్చినా సర్దుకుపోతుంటారు. పెళ్లయ్యాక తమ భాగస్వామి తప్ప వేరొకరికతో పర్సనల్ రిలేషన్స్ పెట్టుకోరని చెప్తుంటారు. కానీ ప్రజెంట్ ఆ పరిస్థితి మారుతోందని, పెళ్లైన వారు కూడా పక్కచూపులు చూస్తున్నారని ఒక సర్వేలో తేలింది. ముఖ్యంగా పురుషుల్లో ఎక్కువమంది భార్య ఉన్నప్పటికీ బయట పరాయి స్త్రీలతో సంబంధాలు పెట్టుకోవడానికి మొగ్గు చూపుతున్నారని వెల్లడైంది. భారతదేశంలోనూ ఈ సంస్కృతి పెరిగిపోతోందని సర్వే పేర్కొన్నది.
వివాహ వ్యవస్థలో మార్పులను తెలుసుకునే ఉద్దేశంతో ప్రముఖ డేటింగ్ యాప్ గ్లిడెన్ నిర్వాహకులు ఇటీవల సర్వే నిర్వహించారు. అయితే ఇందులో భారతదేశంలోని పలువురు వ్యక్తులు తమ వివాహ బంధంలో వ్యక్తిగత విషయాలకు వస్తే సంతృప్తిగా ఉండటం లేదని తేలింది. దాదాపు 60 శాతానికిపైగా జంటలు డేటింగ్ యాప్‌లను యూజ్ చేస్తున్నారని, వీరిలో ఎక్కువశాతం మంది పురుషులు వేరొకరితో డేటింగ్ చేయాలని భావిస్తున్నారని సర్వేను ఎనలైజ్ చేసిన నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవారిలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోందట. డేటింగ్ యాప్స్ ఉపయోగిస్తున్న వారిలో దాదాపు 46 శాతం పెళ్లయిన మగవాళ్లు పరాయి స్త్రీలతో ఎఫైర్ కలిగి ఉంటున్నారని సర్వే పేర్కొన్నది. వీరు భార్యలకు తెలియకుండా సోషల్ మీడియా, పలు రకాల యాప్‌ల ద్వారా ఇతర స్త్రీలతో కనెక్ట్ అవుతున్నారట. ఇక మహిళల్లో 33 నుంచి 35 శాతం మంది తమ భాగస్వామితో కలిసి ఉంటూనే వేరొకరితో ఎఫైర్ పెట్టుకోవాలని ఆలోచిస్తున్నారని సర్వే పేర్కొన్నది.
Read More..
బెస్ట్ ఫ్రెండ్స్‌తో ఈ విషయాలు పంచుకుంటున్నారా? బీ కేర్ ఫుల్..!!