మొగుణ్ణి చిత‌క్కొడుతున్న భార్య‌.. ఈ సీసీ టీవీ ఫుటేజీ చూస్తే వ‌ణుకే! (వీడియో)

by Sumithra |
మొగుణ్ణి చిత‌క్కొడుతున్న భార్య‌.. ఈ సీసీ టీవీ ఫుటేజీ చూస్తే వ‌ణుకే! (వీడియో)
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ఈ వీడియోను భార్యా బాధితుల సంఘం వాళ్లు చూశారంటే, ఇలాంటి దీన స్థితిలో భ‌ర్త‌లు ఉన్నార‌నుకొని వేద‌న‌తో ఆత్మ‌హ‌త్య చేసుకుంటారేమో! అంత‌లా ఓ మహిళ తన భర్తను క్రికెట్ బ్యాట్‌తో కొడుతున్న ఓ గృహ హింసకు సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో బయటపడింది. రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఓ పాఠశాల ప్రిన్సిపాల్‌కు వ‌చ్చిన క‌ఠోర ప‌రిస్థితి ఇది. తన భార్య శారీరకంగా, మానసికంగా వేధిస్తుందంటూ బాధిత ఉపాధ్యాయుడు రక్షణ కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. తన భార్య పాన్, కర్ర, క్రికెట్ బ్యాట్ వంటి బ‌ల‌మైన వ‌స్తువుల‌తో తీవ్రంగా తనపై దాడి చేస్తుందని బాధిత‌ ప్రిన్సిపాల్ పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే, రోజూ ఈ హింస‌ను ఎదుర్కుంటున్న‌ ప్రిన్సిపాల్ సాక్ష్యాలు సేకరించ‌డానికి ఇంట్లో సీసీటీవీ కెమెరాలను అమర్చాడు. త‌ర్వాత‌, రక్షణ కోసం కోర్టును ఆశ్రయించిన ఆయన, ఘటనకు సంబంధించిన ఫుటేజీని సమర్పించారు. ఈ కేసులో ఆయనకు భద్రత కల్పించాలని కోర్టు ఆదేశించింది.

ప్రిన్సిపాల్- అజిత్ సింగ్ యాదవ్ హర్యానాలోని సోనిపట్ నివాసి. సుమన్ అనే మ‌హిళ‌ను ఏడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మొదట్లో వీరి జీవితం ప్రశాంతంగానే సాగినా, కొంత కాలం తర్వాత హింస మొదలైంది. తరచుగా, చీటికీ మాటికీ అజిత్ సింగ్‌ను చిత‌క‌బాదేది. శ‌రీరానికి త‌గిలిన‌ గాయాలతో పాటు, మాన‌సికంగా అజిత్ కృంగిపోయాడు. ప్ర‌స్తుతం గాయాల‌ను మాన్పుకోడాడానికి వైద్య చికిత్స చేయించుకుంటున్నాడు. అయితే, తాను ఇప్పటివరకు మౌనంగా ఉన్నానని, ఉపాధ్యాయ వృత్తికున్న‌ గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని, హింసను సహిస్తున్నానని సింగ్ మీడియాకు చెప్పాడు. "అయితే, ఇప్పుడు నా భార్య అన్ని హద్దులు దాటిపోవడంతో నేను కోర్టును ఆశ్రయించాను" అన్నాడు. తన భార్య సోద‌రుడే తన భార్యను హింసకు ప్రేరేపించాడని ఆరోపించాడు. "నేను సుమన్‌పై ఎప్పుడూ చేయి ఎత్తలేదు. చట్టాన్ని నా చేతుల్లోకి తీసుకోలేదు. నేనొక ఉపాధ్యాయుడిని. ఉపాధ్యాయుడు ఒక మహిళపై చేయి ఎత్తి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటే అది మ‌న‌ సంస్కృతికి, నా వృత్తికి విరుద్ధం" అని అజిత్ ఈ సంద‌ర్భంగా త‌న బాధను వ్య‌క్తం చేశారు.

Advertisement

Next Story