- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మతి మరుపును తగ్గించి.. జ్ఞాపకశక్తి మెరుగుపరచడానికి మార్గాలు
దిశ, ఫీచర్స్: ప్రస్తుత కాలంలో చాలా మంది మెదడు సంబంధిత సమస్యతో సతమతం అవుతున్నారు. ఒత్తిడి కారణంగా జ్ఞాపకశక్తి, ఏకాగ్రత తగ్గుతుంది. నేటి తరం పిల్లలు హుషారుగా ఉన్నప్పటికీ.. చదువు ఇతర ప్రెజర్స్‌తో మెమొరీ కోల్పోతున్నారు. అయితే ఇది సాధారణ విషయమని కొట్టిపడేసినప్పటికీ.. కొన్ని సందర్భాల్లో చాలా నిరాశ పరుస్తాయి. అందుకే విద్యార్థి, ఎంప్లాయి, గృహిణి, వృద్ధులు ఎవరైనా సరే బ్రెయిన్‌లో ఇన్‌ఫర్మేషన్ ప్రాసెస్ చేసే గ్రే సెల్స్‌ను భద్రంగా ఉంచుకోవాలనుకుంటారు. ఈ క్రమంలో జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడే సులభమైన, ప్రభావవంతమైన మార్గాల గురించి తెలుసుకుందాం.
1. మెంటల్ ఎక్సర్‌సైజ్:
కష్టం అనుకోకుండా ఖాళీ సమయంలో మొబైల్‌కు ఇచ్చే సమయం.. పజిల్స్ సాల్వ్ చేయడం, పుస్తకాలు చదవడం, కొత్త భాష నేర్చుకోవడం, లేదా ట్రివియా అభ్యసించడం వంటి పనులు అలవాటు చేసుకోవడం మంచిది. ఇవి మీ మానసిక శక్తిని పెంచడానికి దోహద పడతాయి.
2. మంచి రాత్రి నిద్ర :
ప్రజెంట్ లేట్ నైట్ కాలంగా మారిపోయింది. చాలా వరకు పగలంతా పనులు చేసుకొని .. రాత్రి వేళల్లో కాలక్షేపం చేస్తూ, చాలా సమయం మేలుకొని ఉంటున్నారు. సోషల్ మీడియాలో బ్రతికేస్తున్నారు. కానీ శరీరానికి నిద్ర చాలా ముఖ్యం. నిద్రలో మెదడుకి కొంత విశ్రాంతి లభిస్తుంది. అది మెల్లగా సమాచారాన్ని నెమరు వేస్తుంది. కనుక రోజులో 7-8 గంటల ప్రశాంతమైన నిద్ర పొందడం చాలా అవసరం.
3. అభిరుచికి తగ్గ ప్రమేయం:
మనం దేనిపైనైనా మక్కువ కలిగి ఉంటే అందులో నైపుణ్యం పొందేందుకు మన శక్తిని, సమయాన్ని ఎక్కువగా కేటాయిస్తాము. దీని గురించి ఆలోచిస్తూ మెదడుకు పదును పెడుతూ ఉంటాం. అయితే ఇలా చేయడం కూడా మంచిదే. ఎందుకంటే మనం ఇష్టపడి చేసే పనిలో సంతృప్తి ఉంటుంది. ఆ పని పూర్తి అయ్యేంతవరకు మెదడు దానిపైనే దృష్టిపెడుతూ ఉంటుంది. అందుకే ఇష్టమైన పనులు.. కష్టంగా ఉన్నా మెదడు మాత్రం అలసిపోదు.
4. ఆరోగ్య కరమైన తిండి :
ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు తీసుకునే ఆహారం విషయంలో చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఏదో ఒకటి తింటున్నాంగా అనే ధీమాతో ఉంటున్నారు. కానీ ఆరోగ్యకరమైన తిండి మాత్రం తినడం లేదు. మనం తీసుకునే ఆహారం మీద మన బ్రెయిన్ యాక్టివిటీ ఆధారపడి ఉంటుంది. మంచి ఫుడ్ తీసుకుంటేనే యాక్టివ్‌గా పని చేస్తుంది. అందుకే యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండే తాజా పండ్లు, కూరగాయలు, ఒమేగా-3 కొవ్వు ప్రేరేపిత ఆహారాలు, పీచు పదార్థాలు కలిగి ఉండే ఆహారం తీసుకోండి.
5. ఆల్కహాల్‌ను పరిమితం చేయండి :
మారుతున్న కాలంతో పాటు, మనుషులు కూడా త్వరగా అప్ డేట్ అవుతున్నారు. ఇందులో భాగంగా మద్యం విషయంలో కూడా యూత్ ముందస్తు స్థానంలో ఉంది. ఒకప్పుడు మద్యం తాగడానికి వయసుతో సంబంధం ఉండేది. కానీ ఇప్పుడు, పెరెంట్స్ పిల్లలతో కలిసి మందు తాగుతున్నారు. కానీ అది చాలా ప్రమాదకరం. ఎందుకంటే అప్పుడే ఎదిగే పిల్లల మెదడులోని కణాలు చాలా యాక్టివ్‌గా ఉంటాయి. అలాంటప్పుడు అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మెదడులోని కణాలను చంపి, చురుకుదనం, జ్ఞాపకశక్తిని తగ్గిస్తుంది.
6. ప్రాక్టీస్ మెడిటేషన్ :
ధ్యానం, యోగా మనస్సుకు చాలా ప్రశాంతతను కలిగిస్తుంది. క్రమం తప్పకుండా ధ్యానం, యోగా.. ఉదయం, సాయంత్రం చేస్తుంటే ఏకాగ్రత మెరుగుపరుడుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
7. ఒత్తిడిని నివారించండి :
సుదీర్ఘమైన ఒత్తిడి మానవుడిని శారీరకంగా, మానసికంగా కృంగతీస్తుంది. దీని కారణంగా జ్ఞాపకశక్తి మెల్లమెల్లగా తగ్గుతుంది. కాబట్టి జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదురైనా కూడా సహనంతో, ఓర్పుతో వ్యవహరించాలి. ఒత్తిడి తీసుకోకూడదు.
8. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి:
మద్యం, పొగాకు, డ్రగ్స్.. ఈ మూడింటికి ఒకసారి అలవాటు పడితే.. కచ్చితంగా బానిస అవుతారు. ఇవి చాలా ప్రమాదకరమైన అలవాట్లు.. మనిషిని మెంటల్‌గా డిస్టర్బ్ చేస్తాయి. శరీరంలో మార్పులతోపాటు జ్ఞాపకశక్తిపై ప్రభావం పడుతుంది. అందుకే ఇలాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది.
9. జంక్ మరియు ఫాస్ట్ ఫుడ్స్‌ను నివారించండి :
రోడ్ సైడ్ జంక్ ఫుడ్, ఫ్రైడ్ ట్రాన్స్-ఫ్యాట్-రిచ్ ఫుడ్స్ కూడా మీ జ్ఞాపక శక్తిపై ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. ఎందుకంటే అది బ్రెయిన్‌కు అవసరమైన పోషకాలు అందకుండా చేస్తాయి.
ఇవి కూడా చదవండి: స్ట్రాబెర్రీ దంతాలను తెల్లగా చేస్తుందా..?