2024 లో సంపూర్ణ సూర్యగ్రహణం అప్పుడే.. ఈ సంఘటన గురించి మీకు తెలుసా?

by Jakkula Mamatha |
2024 లో సంపూర్ణ సూర్యగ్రహణం అప్పుడే.. ఈ సంఘటన గురించి మీకు తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: సంపూర్ణ సూర్యగ్రహణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూనే ఇతర గ్రహాల చుట్టూ తిరుగుతుంది. ఈ క్రమంలోనే భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు, భూమి మీద కొంత భాగానికి సూర్యుడు కనిపించకుండా పోతాడు. ఈ క్రమంలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. తాజాగా.. ఈ నూతన సంవత్సరంలో ‘ ఏప్రిల్ 8వ ’ తేదీన సూర్యగ్రహణం ఏర్పడబోతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది ఏర్పడడం వల్ల అంతరిక్షంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయని అంటున్నారు.

భూమిపై నివసించే సమస్త జీవరాశిపై ఇది ప్రభావం చూపుతుందని సమాచారం. అంతేకాదు.. ఇది ప్రపంచమంతా ఒకే విధమైన ప్రతికూలతను చూపిస్తుంది అని జ్యోతిష్యులు సైతం అంచనా వేశారు. అయితే ఈ గ్రహణం మెక్సికో, యునైటెడ్ స్టేట్స్, కెనడా గుండా ప్రయాణించి నార్త్ అమెరికాను దాటబోతుంది. అందువల్ల ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న భారతీయులు మాత్రం ఈ గ్రహణం పడుతుండటం చూడలేరు. అయినా పెద్దవారు గ్రహణలు చూడటం మంచిది కాదు అని చెపుతారు. జ్యోతిష్యులు కూడా కొన్ని రాశుల వారు గ్రహణ సమయంలో బయటికి రావద్దు అని చెప్పారు. ఏది ఏమైనప్పటికీ ఈ ఏడాదిలో సంపూర్ణ సూర్య గ్రహణం అద్భుతమే అని చెప్పవచ్చు.

Advertisement

Next Story

Most Viewed