10 అడుగుల పొడవైన దోశ.. 40 నిమిషాల్లో ఆరగిస్తే డెబ్భై వేలు సొంతం

by Disha News Web Desk |
10 అడుగుల పొడవైన దోశ.. 40 నిమిషాల్లో ఆరగిస్తే డెబ్భై వేలు సొంతం
X

దిశ, ఫీచర్స్ : దేశ రాజధాని నగరం ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ భోజన ప్రియుల కోసం యూనిక్ చాలెంజ్‌ ప్రవేశపెట్టింది. ఉత్తమ్ నగర్‌లోని స్వామి శక్తి సాగర్ అనే ఈటరీ.. 10 అడుగుల దోశను నలభై నిమిషాల్లో ఆరగించిన వారికి రూ.71,000 ప్రైజ్ మనీ అందజేస్తామని ప్రకటించింది.

ఈ దోశ చాలెంజ్ గురించి వివరించిన హోటల్ యజమాని శేఖర్.. 'కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఏదైనా డిఫరెంట్‌గా ట్రై చేయాలని అనుకున్నా. అందుకే పెద్ద పెద్ద తవాలు(పాన్) తయారు చేసే ప్రదేశానికి వెళ్లి 10 అడుగుల పొడవులో తయారు చేయమని అడిగాను. ప్రస్తుతం చేస్తున్న తవా 10 అడుగుల 4 అంగుళాలు. దీనిపై దోశ తయారీకి 7-8 నిమిషాలు పడుతుంది. మేము ఈ చాలెంజ్ ప్రారంభించి నెల రోజులైంది. ఇప్పటి వరకు 25-26 మంది ఈ చాలెంజ్‌ను స్వీకరించారు కానీ ఎవరూ గెలవలేదు. చాలా చోట్ల నుంచి మాకు కాల్స్ వస్తున్నాయి. అయితే దోశ పరిమాణం పెంచినప్పటికీ నాణ్యతపైనా దృష్టి పెడుతున్నాం' అని చెప్పారు.

ఇక ఈ చాలెంజ్‌ను స్వీకరించిన సురేంద్ర గుప్తా అనే కస్టమర్.. రూ. 71 వేలు గెలుచుకోవాలని అనుకున్నప్పటికీ దోశ పూర్తిగా తినలేకపోయినట్లు తెలిపాడు. దోశ రుచిగా ఉండటంతో చాలెంజ్ కంప్లీట్ చేయొచ్చని భావించినప్పటికీ సాధ్యపడలేదన్నాడు. అయితే దీని ధర రూ. 1,500 ఉండటంతో చాలెంజ్ స్వీకరిస్తే తప్పకుండా ప్రైజ్ మనీ గెలవాలని అనుకున్నాను. కానీ ఇప్పుడు నా మొత్తం కుటుంబం కలిసి ఈ దోశను తినగలుగుతోందని అన్నారు.

https://www.instagram.com/reel/CZLs9UlgiHN/?utm_source=ig_embed&ig_rid=8371ac64-e579-481c-bb50-cdcd487dae02


Advertisement

Next Story

Most Viewed