లాక్ డౌన్ నేపథ్యంలో.. చిన్నారులకు రేడియోలో పాఠాలు

by Shyam |
లాక్ డౌన్ నేపథ్యంలో.. చిన్నారులకు రేడియోలో పాఠాలు
X

దిశ వెబ్ డెస్క్
ఇప్పుడంటే అందరికీ ఇల్లలో టీవీలున్నాయి.. చేతుల్లో మొబైల్ ఫొన్లున్నాయి. ఇంటర్నెట్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. దేశంలోనే కాదు.. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా .. క్షణాల్లో మనకు తెలిసిపోతుంది. కానీ ఒకప్పుడు మనకు సమాచారం తెలియాలంటే.. ఉన్న ఏకైక సాధనం ‘‘రేడియో’’. వినోదం కావాలన్నా.. విజ్ఞానం కావాలన్నా… చివరకు క్రికెట్ స్కొర్ తెలుసుకోవాలన్నా రేడియోను ఆధారం. డిజిటిల్ సొబగులు అద్దుకున్న నాటి రేడియో.. నేటి ఎఫ్ ఎం కు మెట్రో సిటీల్లో ఆదరణ బాగానే ఉంది. మన దేశ ప్రదాని కూడా రేడియో ద్వారానే మన దేశ ప్రజలకు తన మనసులోని భావాలను ‘‘మన్ కీ బాత్ ’’ పేరుతో అందిస్తున్నాడు. ఇప్పుడు ఈ రేడియో గోల ఏంటీ అనుకుంటున్నారా? దేశమంతా లాక్ డౌన్ అయిన నేపథ్యంలో.. రేడియో మిర్చిలో పిల్లల కోసం పాఠాలు చెప్పబోతున్నారు. అదీ సంగతి.. ఆ విశేషాలు.. ఏంటంటే..

ఒకనాడు తెలుగునాట రేడియో అక్కయ్య, రేడియో అన్నయ్య పాఠాలు ఎంతో ప్రజాదరణ పొందాయి. ‘బాలానందం’ పేరుతో ఎన్నో సృజనాత్మక కార్యక్రమాలు వచ్చేవి. అవి పిల్లల్లో వికాసాన్ని, జ్ఞానాన్ని పెంపొందించాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంగా కొన్నేళ్ల పాటు ఈ కార్యక్రమం విజయవంతంగా సాగింది. తాజాగా ఇలాంటి ఆలోచననే యునిసెఫ్, రేడియో మిర్చి సంస్థ సంయుక్తంగా చేపట్టాయి. ఎఫ్ఎం అంటే కేవలం పాటలు మాత్రమే కాకుండా పాఠాలు కూడా వినిపిస్తామంటూ రేడియో మిర్చి ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రేడియో మిర్చి.. యునిసెఫ్ సహకారంతో రేడియో స్కూలింగ్‌ను మార్చ్ 24న ప్రారంభించింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం ఐదు గంటలకు రేడియో పాఠాలను అందిస్తోంది. ‘మిర్చికి పాఠశాల’ పేరుతో 3 నుంచి 12 ఏళ్ల లోపు పిల్లల కోసం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది.
ఈ కార్యక్రమం వెనక ముఖ్య ఉద్దేశం.. పిల్లల్లోని అభ్యాస లక్షణాలను పెంపొందించడంతో పాటు కరోనాపై అవగాహన కలిగించడం, అలాగే తల్లిదండ్రులు, బంధువులు, తాతయ్యలు, అమ్మమ్మలు, నాయనమ్మలతో పిల్లలకు ఉన్న అనుబంధాన్ని మరింత పటిష్టం చేయడమని చత్తీస్‌గఢ్ యునిసెఫ్ ప్రతినిధి జచరియా అన్నారు. నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుత పౌరులుగా ఎదిగేలా, సృజనాత్మకత పెంచేలా తమ కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. హిందీ, ఇంగ్లీషులలో పాఠాలు ఉంటాయన్నారు.

Tags: radio, fm , lessons,children,modi, unicef,mirchi,songs,entertainment,corona virus

Advertisement

Next Story