- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘బ్యాలెట్’ బాక్స్‌లో కేసీఆర్‌కు లేఖలు..
దిశ, తెలంగాణ బ్యూరో : ఓటు హక్కును వినియోగించుకునే క్రమంలో తమ సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ఎమ్మెల్సీ ఎన్నికలను సందర్భంగా వినియోగించుకుంటున్నారు. మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం ఓట్ల కౌంటింగ్‌లో బ్యాలెట్ పత్రాలతో పాటు ఐదు లేఖలు బయటపడ్డాయి. తమ ఓట్లతో పాటు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫీల్డ్ అసిస్టెంట్లు లేఖ రాసినట్టు ఎన్నికల అధికారులు గుర్తించారు.
రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లను గతంలో ప్రభుత్వం తొలగించిన విషయం విధితమే.. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన ఫీల్డ్ అసిస్టెంట్లు తమను విధుల్లోకి తీసుకోవాలని రాసిన లేఖలను బ్యాలెట్ బాక్స్‌ల్లో వేశారు. వికారాబాద్ జిల్లా లోని పూడురు పోలింగ్ బూత్‌లో మూడు, కోస్గికి చెందిన బూత్ నెంబర్ 158లో మరో రెండు లెటర్లు ముఖ్యమంత్రిని అడ్రస్ చేస్తూ భయటపడ్డాయి.