- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేటీఆర్ ఇలాకాలో మావోయిస్టుల లెటర్, ఎర్రజెండాల కలకలం..(వీడియో)
దిశ, వేములవాడ : సిరిసిల్ల జిల్లాలో భారత కమ్యూనిస్టు పార్టీ పేరిట రాసిన లెటర్, ఎర్రజెండాలు కలకలం సృష్టించాయి. కోనరావుపేట మండలం భూక్య రెడ్డి తండా గ్రామపంచాయతీలో ఒక లెటర్‌తో పాటు నిమ్మపల్లి చెరువు నుంచి మర్రిమడ్ల వెళ్లే దారిలోని దాదాపు 50 ఎకరాల భూమిలో ఎర్రజెండాలు వెలిశాయి.
కొన్నేళ్ల క్రితం మరిమడ్ల వాసులతో పాటు మరికొంతమంది చెట్లను కొట్టి చదును చేసుకున్నారు. ఈ భూమి అంతా ఫారెస్ట్‌కు చెందినదని చెప్పి అటవీశాఖ అధికారులు స్వాధీనపర్చుకున్నారు. దీనిలో నీలగిరి చెట్లను పెంచారు. దాదాపు 15 ఏళ్ల క్రితం అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న ఈ భూమి భూక్య రెడ్డి తండా వాసులకు చెందింది అంటూ మావోయిస్టుల పేరిట లెటర్ రాసి గ్రామపంచాయతీలో వేయడంతో పాటు 50 ఎకరాల భూమిలో ఎర్రజెండాలను ఏర్పాటు చేశారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మావోయిస్టుల పేరిట రాసి ఉన్న లెటర్‌తో పాటు అటవీ శాఖ ఆధీనంలో ఉన్న భూమిలో వెలసిన ఎర్ర జెండాలను స్వాధీనం చేసుకున్నారు.