- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
సీఎంకు లేఖ ఆకలి తీర్చింది
కరోనా కష్టాలు కన్నీళ్లను నింపుతున్నాయి. పనుల్లేవు, పైసల్లేవు, దీంతో ఆకలి బాధలు తాళలేని ఇల్లాలు నేరుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసి ఆకలి తీర్చుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..
విశాఖపట్టణ శివారులోని గాజువాక కొండ ప్రాంతంలోని పెంటయ్యనగర్‌కు చెందిన బొడ్డటి పూజ తన ముగ్గురు పిల్లలతో నివాసముంటోంది. ఆ కుటుంబాన్ని కరోనా కష్టాలు చుట్టుముట్టాయి. దీంతో ఆమె సీఎం జగన్‌కి లేఖ రాసింది. కరోనా వ్యాప్తి నిరోధానికి విధించిన లాక్‌డౌన్ తన కుటుంబానికి పెద్ద కష్టం తీసుకొచ్చిందని తాను పేదరికంలో మగ్గుతున్నానని తాపీ మేస్త్రీగా పని చేసే తన భర్తకు జీవనోపాథి పోయిందంటూ లేఖలో వాపోయింది. ఈ పరిస్థితుల్లో తన పిల్లలకు ఏం పెట్టాలో కూడా తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది.
దీనిపై స్పందించిన సీఎం కార్యాలయాధికారులు వెంటనే ఆ కుటుంబ సమస్యలు పరిష్కరించాలని, సత్వరమే వారికి ఉచిత రేషన్ అందజేయాలని వైజాగ్ జేసీని ఆదేశించారు. జేసీ వేగంగా స్పందించి, పౌరసరఫరాల శాఖాధికారులను వారింటికి పంపారు. దీంతో వెంటనే వారింటికి వెళ్లిన పౌరసరఫరాల శాఖ అధికారులు 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, అర కేజీ పంచదారను అందజేశారు. దీంతో పూజ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.
Tags: andhra pradesh, ap cmo, letter, free ration, poor family got ration