- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సైనిక దాడిని ఓడిద్దాం.. మావోయిస్టుల లేఖ
దిశ, వాజేడు : ఆపరేషన్ ప్రహర్ సైనిక దాడిని ఓడిద్దాం.. నూతన ప్రజాస్వామిక విప్లవం లక్ష్యంతో కొనసాగుతున్న భారత విప్లవ ఉద్యమాన్ని కాపాడుకుందాం.. సైనిక దాడులను నిరసిస్తూ ఏప్రిల్ 26న భారత బందులో భాగంగా జెఎండబ్ల్యుపి డివిజన్ లోని అన్ని వర్గాల ప్రజలు బంద్ ను విజయవంతం చేయాలంటూ వాజేడు వెంకటాపురం ఏరియా కమిటీ కార్యదర్శి సుధాకర్ పేరిట లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో కేంద్ర ప్రభుత్వం సామ్రాజ్యవాదుల దళారీ పెట్టుబడిదారుల ఆదేశాలనుసారం జల్ జంగిల్ జమీన్ ఖనిజ సంపదను దోచుకోవడానికి అడ్డుగా ఉన్న మావోయిస్టు పార్టీని అణిచి వేయడానికి, ఆహార సైనిక దాడిని 2019 డిసెంబర్ నుండి మొదలుపెట్టారని, 2020 సంవత్సరం నుండి ఇప్పటివరకు ఈ దాడిలో దేశవ్యాప్తంగా మూడు వందలకు పైగా ప్రజలు పిఎల్ జిఎ సభ్యులు కమాండర్ వివిధ స్థాయిలో నాయకత్వం వహించిన కామ్రేడ్స్ ను బూటకపు ఎన్ కౌంటర్ ల ద్వారా చిత్రహింసలు, విష ప్రయోగాల ద్వారా పోలీసు బలగాలు హత్య చేశారని ఆరోపిస్తూ లేఖలో పేర్కొన్నారు.