- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దీపావళి ప్రత్యేకత తెలుసుకుందాం..
దిశ, వెబ్‌డెస్క్: భారతీయ సంస్కృతీ, సాంప్రదాలను ప్రతిబింబించే పండుగల్లో దీపావళి ఒకటి. ఈ పండుగను కుల,మత బేధాలు మరిచి అందరూ ఆనందోత్సహాల మధ్య జరుపుకుంటారు. అంతేగాకుండా భారతీయ సంస్కృతిలో భాగంగా జరుపుకునే పండుగలన్నిటికీ ఒక ప్రత్యేకత, చరిత్ర ఉంటుంది. దానికి సంబంధించిన ప్రత్యేకత, చరిత్రను దాదాపు 50 శాతం మంది తెలుసుకోకుండానే ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఉత్సవాలు దీపాలు, టపాకాయలు, పూజలు, బహుమతులు వంటి కార్యక్రమాలు చేస్తూ… ఆనందోత్సహాల మధ్య ఆనందంగా గడుపుతారు. అయితే ప్రస్తుతం మనం దీపావళి పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం.
నరకాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు, రాక్షసుడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి వేడుక చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాలు, పిండివంటలు, బాణసంచాలు దీపావళి సోయగాలు. అంతేగాకుండా ఈ పండుగ ప్రతి సంవత్సరం ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి. దీన్ని నరక చతుర్థశిగా జరుపుకుంటారు. ఆ రోజు మహిళలందరూ ఆశ్వీయుజ బహుళ చతుర్దశి నుంచి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగిస్తారు. చివరకు ఈ దీపాలను ముత్తయిదువులు కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానాలను ఆచరించి జీవనదులలో వదులుతారు. ఇవి సౌభాగ్యానికి, సౌశీల్యానికి, సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తారు.
అంతేగాకుండా దీపావళి పండుగ వెనుక ఎన్నో కథలు ఉన్నాయని పురాణాలు చెపుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో పంట చేతికి వచ్చిన ఆనందంలో అన్నదాతలు దీపాలు వెళిగించి పండుగను చేసుకుంటారు. మంచి దిగుబడిని అందించినందుకు ఇష్టదైవానికి కృతజ్ఞతగా ప్రత్యేక పూజలు చేస్తారు. అంతేగాకుండా రామాయణంలో రాముడు ఆయన తండ్రి దశరథుని కోరిక మేరకు భార్య సీతతో కలిసి 14 సంవత్సరాలు వనవాసం వెళతాడు. అలా వాళ్లు అడవిలో జీవనం కొనసాగిస్తుండగా, సీతాదేవిపై కన్నేసిన రావణాసూరుడు యాచకుడిగా వచ్చి, సీతాదేవిని ఎత్తుకెళుతాడు. అనంతరం రాముడు, రావణాసుడి మధ్య భారీ యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో పదితలల రాక్షస రావణున్ని రాముడు అంతం చేస్తాడు. దీంతో శ్రీరామునికి స్వాగతం పలికేందుకు అయోధ్యావాసులు దీపాలను వెలిగించి అమావాస్య చీకట్లను పారద్రోలుతారు. ఆనాటి నుంచి దీపావళి పండుగను మనం జరుపుకుంటున్నాం. అంతేగాకుండా నరకాసురుడు అనే మరో రాక్షసుడు దేవతలను మహర్షులను నానా ఇబ్బందులు పెడుతుంటాడు. నరకాసురుని ఆగడాలు శృతిమించడంతో సత్యభామ సమేతుడైన శ్రీకృష్ణుడు నరకాసురుని సంహరిస్తాడు. నరకాసురుని పీడ విరగడవ్వడంతో ప్రజలు దీపాలు వెలిగించి పండుగ జరుపుకుటున్నామని పురాణాలు చెబుతున్నాయి.