మెదక్‌లో చిరుత సంచారం..

by Shyam |
మెదక్‌లో చిరుత సంచారం..
X

దిశ, వెబ్‌డెస్క్: మెదక్ జిల్లాలో చిరుత సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది. జిల్లాలోని వెల్దుర్తి మండలం కుకూనూర్‌లో శివారులో గురువారం గొర్రెల మందపై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో రెండు గొర్రెలు మృత్యువాత పడ్డాయి. గమనించిన గొర్రెల కాపరులు గట్టిగా కేకలు పెట్టడంతో చిరుత అక్కడి నుంచి పారిపోయినట్లు వారు వెల్లడించారు.

ఈ విషయం తెలియడంతో చుట్టుపక్కల గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కాగా, సమాచారం అందుకున్న ఫారెస్టు అధికారులు చిరుత కోసం గాలిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed