- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వికారాబాద్ జిల్లాలో చిరుత కలకలం.. ఆవును చంపేసి..
by Shyam |
X
దిశ, పరిగి : వికారాబాద్ జిల్లా పరిగి డివిజన్ కులకచర్ల మండల పరిధిలోని చెరువుముందలి తండాలో చిరుత కలకలం రేపింది. తండాకు చెందిన శంకర్ నాయక్ అనే రైతు తన ఆవును సోమవారం రాత్రి పొలం వద్ద కట్టేసి ఇంటికి వెళ్లాడు. మంగళవారం ఉదయం పొలం వద్దకు వెళ్లి చూడగా ఆవు కనిపించలేదు. పొలానికి సమీపంలో ముళ్లపొదల్లో ఆవును చంపి చిరుత తిన్నట్లు ఆనవాళ్లు కనిపించాయి. గతంలో కూడా చిరుత ఇలా పశువులపై దాడి చేస్తూ చంపి తినేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పశువులపై చిరుత దాడులు చూసి తండా ప్రజలు భయాబ్రాంతులకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
Advertisement
Next Story