- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎవడికి వాడే దేవుడు.. టీనేజ్ గర్ల్ పాయింట్ ఆఫ్ వ్యూ
దిశ, సినిమా : తమిళ్ ఫిల్మ్ ‘మాదతి’.. తమిళనాడులోని పుతిరాయ్ వన్నర్ కమ్యూనిటీకి చెందిన టీనేజ్ గర్ల్ కథ ఆధారంగా తెరకెక్కింది. పుతిరాయ్ వన్నర్ తెగకు చెందిన వారు ఎందుకు అంటరానివారిగా పరిగణించబడుతున్నారు? సమాజం వారిని ఎందుకు అశుద్ధులుగా, మురికివారుగా చూస్తోంది? పీరియడ్స్‌లో ఉన్న మహిళల బట్టలు ఉతికే ఖర్మ ఆ తెగకు ఎందుకు? వారు అలాగే ఎందుకు మిగిలిపోతున్నారు? ఎందుకంత వివక్షకు గురవుతున్నారు? అనే అంశాలను లేవనెత్తింది. లింగం, కుల గుర్తింపు, మతవిశ్వాసాలు, హింస గురించి ప్రస్తావించిన ఈ చిత్రం సమాజంలో కొంతమంది ఎదుర్కొంటున్న వివక్షత పద్ధతులను ప్రతిబింబించింది. ‘ఏ శరీరానికి దేవుడు లేడు. ఎవరికి వారే దేవుళ్లు’ ట్యాగ్ లైన్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి లీనా మణిమేకలై దర్శకత్వం వహించడంతో పాటు నిర్మించారు కూడా. జూన్ 24న ఓటీటీ ప్లాట్ ఫామ్ నిస్ట్రీమ్‌లో రిలీజ్ కాబోతున్న సినిమా ఇప్పటికే విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, లాటిన్ అమెరికన్ ఫిక్కీ లాంటి పలు చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించబడిన ఈ చిత్రం.. ఔరంగాబాద్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఫిప్రేస్సీ జ్యూరీ అవార్డు అందుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ సినిమాటోగ్రఫీ కేటగిరీల్లో గోల్డెన్ కైలాషా అవార్డు అందుకున్నారు.
Presenting the official motion poster of 'Maadathy: An Unfairy Tale' directed by @LeenaManimekali ✨
Congratulations to the cast & crew for such a powerful film. Watch @MaadathyTheFilm on @neestream from June 24th onwards.#Maadathy #MaadathyMovie@GRfilmssg @karuvachyfilms pic.twitter.com/80aY2c0jdq— Parvathy Thiruvothu (@parvatweets) June 14, 2021