‘ధ్యానం చేస్తే మానవునికి శక్తి వస్తుంది’

by Sridhar Babu |
‘ధ్యానం చేస్తే మానవునికి శక్తి వస్తుంది’
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: కరోనా మహమ్మారి నియంత్రణకు కాస్మిక్ శక్తి దోహదపడుతుందని ఖమ్మం నగర ప్రముఖ శాస్త్రవేత్త సాజిద్ అక్బర్ అహ్మద్ తెలిపారు. ఆదివారం ఖమ్మం ప్రెస్ క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మానవుడు ఈ కాస్మిక్ శక్తిని సాధించడానికి తన శక్తి యుక్తులను కూడగట్టుకొని మనసును లగ్నం చేసి, ఏకాగ్రతతో, ఓపికతో ధ్యానము సముపార్జించినట్లైతే కొంత శక్తి అనేది మానవునికి వస్తుందన్నారు. ఇదే తరహాలో కొన్ని సంవత్సరాలు చేస్తే మనసుపై పట్టు వస్తుందని తద్వారా పంచేంద్రియాలపై అవగాహన వస్తుందని, దీంతో ధ్యానం ద్వారా ఐదు ఇంద్రియాలను కట్టడి చేయడం వల్ల కాస్మిక్ శక్తి ఉత్పన్నం అవుతుందని తెలిపారు.

దీని మూలంగా అనారోగ్యంతో ఉన్న మానవులు వెంటనే బయటపడే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ కాస్మిక్ శక్తి వల్ల మనిషి తెల్ల రక్త కణాల శక్తిని పెంచుకోవచ్చని వెల్లడించారు. తద్వారా ఎలాంటి బాక్టీరియా శరీరంలో ప్రవేశించినా వాటిని తెల్ల రక్తకణాలు వాటిని నాశనం చేస్తాయని, అప్పుడు మనిషి ఆరోగ్యంతో జీవించడానికి కాస్మిక్ శక్తి ఉపయోగపడుతుందన్నారు. కాబట్టి స్థానిక ప్రజలు ఈ కాస్మిక్ శక్తి అవగాహన కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని మంచి ఆరోగ్యంతో జీవించాలని ఆయన కోరారు.

Next Story

Most Viewed