- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కలెక్టరేట్ ఎదుట చీపుర్లతో రోడ్లు ఊడ్చిన నాయకులు
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : ఉత్తరప్రదేశ్‌లో చనిపోయిన రైతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షుడు, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర రెడ్డి, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు రామారావు పటేల్ పేర్కొన్నారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు చీపురుతో రోడ్లను శుభ్రపరిచి, కలెక్టర్ ఆఫీస్‌లో వినతి పత్రం అందించారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. ఉత్తర ప్రదేశ్‌లో రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ప్రశాంతంగా ధర్నా నిర్వహిస్తున్న రైతులపై కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ కాల్పులు జరిపి వాహనంతో తొక్కించాడని, రైతుల చావుకు కారణమైన అతడిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు.
కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను కేంద్ర మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేసి ఆయన కుమారుడి పై చర్యలు తీసుకోవాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఈ చావులకు బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు రామారావు పటేల్, నిర్మల్ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు ఆనంద్ రావు పటేల్, నిర్మల్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు బిద్దుర్ రమేష్, భైంసా టౌన్ అధ్యక్షుడు వడనపు శ్రీనివాస్, కుంటాల ఎంపీపీ గజ్జారం, వైస్ ఎంపీపీ పసుల నవీన్, కుంటాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంగల్ రావు, భోజరాం పటేల్, ముథోల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాయినాథ్, యువజన కాంగ్రెస్ నాయకులు సుద్రశన్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.