- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీడీపీ దిమ్మెపై టీఆర్ఎస్ జెండా ఎగురవేసిన నాయకులు
దిశ,మహేశ్వరం: మహేశ్వరం మండలం కోళ్లపడకల్ గ్రామంలో గురువారం టీడీపీ పార్టీ జెండా దిమ్మెపై టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు హన్మగల్ల చంద్రయ్య టీఆర్ఎస్ పార్టీ రంగు(పింక్) వేసి జెండా ఎగురవేశారు. ఈ విషయాన్ని టీడీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులుకు సమాచారం అందించడంతో కోళ్లపడకల్ గ్రామానికి బక్కని నర్సింహులు చేరుకున్నారు. టీడీపీ పార్టీ దిమ్మె పై టీఆర్ఎస్ పార్టీ రంగు(పింక్) వేసి, జెండా ఎందుకు ఎగురవేశారని బక్కని నర్సింహులు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు హన్మగల్ల చంద్రయ్యను అడగడంతో, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పొరపాటు జరిగిందన్నారు.
రేపటి లోపు దిమ్మెకు టీడీపీ రంగు(పసుపు) వేస్తానని హామీ ఇవ్వడంతో ఇరు పార్టీల నాయకులు సర్ధుకుపోయారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు మాట్లాడుతూ.. గ్రామాలల్లో ప్రజలు అన్నదమ్ముల వలే కలిసి ఉండాలని, ఎన్నికల సమయంలో ఎవరూ ఏ పార్టీలో ఉన్న పార్టీలు శాశ్వతం కాదు, మానవత్వం ముఖ్యమని గుర్తుంచుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సంధ్యపోగురాజశేఖర్, చేవెళ్ల పార్లమెంట్ జనరల్ సెక్రటరీ జగదీష్‌రెడ్డి, అధికార ప్రతినిధి ఎగ్గడి సత్తయ్య, టీ ఎన్ ఎస్ ఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సవీంద్ర చౌహన్, రవీందర్, నాయకులు మల్లేష్, శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
- Tags
- hoisting