రూ.5 లక్షల వ్యయంతో నూతన మంజీరా పైపులైన్‌కు శంకుస్థాపన

by Shyam |
mla ghandi
X

దిశ, మియాపూర్: మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన తాగు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యమని విప్, ఎమ్మెల్యే గాంధీ అన్నారు. మంగళవారం హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని శాంతి నగర్‌లో రూ.5 లక్షల వ్యయంతో చేపట్టనున్న నూతన మంజీరా మంచి నీటి పైపులైన్ నిర్మాణ పనులకు జలమండలి అధికారులు, కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్ , రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మంచి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటింటికి స్వచ్ఛమైన మంచి నీరు అందించడమే ప్రభుత్వ ద్యేయం అన్నారు. కాలం చెల్లిన పాత పైపులైన్‌లో కలుషిత నీరు కలవటం వలన కాలనీ వాసుల కోరిక మేరకు పాత పైపులైన్ స్థానంలో కొత్త పైపులైన్‌ను వాటర్ వర్క్స్ బోర్డ్ నిధుల ద్వారా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి జీ ఎం రాజశేకర్ , డీ జీ ఎం నాగ ప్రియ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed