- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగిత్యాల కోర్టు సంచలన తీర్పు.. ‘ప్రతీకారానికి జీవితఖైదు’..
దిశ ప్రతినిధి, కరీంనగర్ : జగిత్యాల జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఓ హత్య కేసులో అడ్వకేట్‌తో పాటు మరో ముగ్గురికి జీవిత ఖైదు విధిస్తూ రూ. 20 వేల చొప్పున జరిమానా కూడా కట్టాలని తీర్పునిచ్చింది. 2012న పెగడపల్లి మండలం సుద్దపల్లికి చెందిన మోహన్ రెడ్డి అనే వ్యక్తిని పాత కక్ష్యల నెపంతో హత్య చేసిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. 120-బి, 302, 109 రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్లలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్య జరిగిన తరువాత 10 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని నిందితులుగా చేర్చారు. ఆ తరువాత ఐదుగురికి ఈ కేసుతో సంబంధం లేదని గుర్తించిన పోలీసులు వారిని కేసు నుండి తొలగించారు. నిందితుల్లో అడ్వకేట్ రాచకొండ గంగారెడ్డి, బిడిగె నర్సయ్య అలియాస్ జీపు నర్సయ్య, పన్నాల మహేష్, నర్సింహరెడ్డి అలియాస్ నర్సయ్యలకు జీవిత ఖైదు విధిస్తూ జగిత్యాల జిల్లా రెండో అడిషనల్ జడ్జి జి.సుదర్శన్ తీర్పును ఇచ్చారు. అలాగే నిందితులకు రూ. 20 వేల చొప్పున జరిమానా కూడా విధించారు. ఈ కేసులో ఏ3గా ఉన్న రాచకొండ అంజిరెడ్డి మరణించాడని పోలీసులు తెలిపారు.
ప్రతీకారం కోసం..
ఈ కేసులో హత్యకు గురైన మోహన్ రెడ్డి రాచకొండ గంగారెడ్డి తండ్రిని గతంలో హత్య చేశాడు. అయితే, ఈ కేసులో మోహన్ రెడ్డికి కోర్టు శిక్ష కూడా విధించింది. జైలు జీవితం గడిపి బయటకు వచ్చిన మోహన్ రెడ్డిని ప్రతీకారం తీర్చుకునేందుకు హత్య చేశాడు. ఈ కేసులో కోర్టు తీర్పు మేరకు గంగారెడ్డి జీవిత ఖైదీ అయ్యాడు.