దాతలు ముందుకు రావాలి : లారెన్స్

by Shyam |
దాతలు ముందుకు రావాలి : లారెన్స్
X

అనాథలకు ఆపదొస్తే ఆదుకునే వారిలో కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ ముందుంటారనే విషయం తెలిసిందే. అంతేకాదు లారెన్స్ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో చెన్నైలో ఆయన అనాథ శ‌ర‌ణాల‌యాన్ని కూడా నడుపుతున్నారు. అయితే కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్లు విధించినప్పటికీ వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడం లేదు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించింది. ఈ నేపథ్యంలో అనాథాశ్రమంలో ఉండే పిల్లలకు అండగా ఉండనున్నట్టు లారెన్స్ ప్రకటించారు. అంతేకాదు ‘చాలా మంది అనాథాశ్రమ పిల్లలు ఆహారం కోసం బాధపడుతున్నారు. ఇలాంటి క‌ష్ట కాలంలో అనాథాశ్ర‌మాల్లోని పిల్ల‌ల‌కు సాయమందించేందుకు దాత‌లు ముందుకు రావాల‌ని’ ట్విట‌్టర్ వేదిక‌గా ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.

‘చాలా మంది పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. ముఖ్యంగా అనాథపిల్లలు. నాకు ఆకలితో పాటు ఆహారం విలువ తెలుసు. ఈ క్రమంలో జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్‌ సూర్యకళతో కలిసి పిల్లల సంరక్షణకు తగిన‌ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పిల్లల కోసం నిత్యావసరాలు సరఫరా చేసిన ఆమెకి ధన్యవాదాలు. కొంత సాయమైనా చాలా మంది ఆకలి తీరుస్తుంది’ అని లారెన్స్ తన ట్వీట్‌లో తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed