ఉస్మానియా ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్ సేవలు ప్రారంభం

by Shyam |
Osmania Hospital
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్: ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో కొత్తగా నెలకొల్పబడిన అత్యాధునికమైన క్యాథ్ ల్యాబ్ సేవలు కార్డియాలజీ విభాగంలో సోమవారం ప్రారంభమైనట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ తెలిపారు . ఈ మేరకు ఆయన మాట్లాడుతూ మొదటి రోజున ఐదుగురు రోగులకు ఈ సేవలు అందించినట్లు చెప్పారు . పూర్తి స్థాయి క్యాథ్ ల్యాబ్ సేవలను గుండె సంబంధ జబ్బులున్న పేద రోగులు వినియోగించుకోవాలని సూచించారు . ముందుగా చెప్పిన ప్రకారం స్వల్ప వ్యవధిలోనే ఆస్పత్రిలో క్యాథల్యాబ్ సేవలు అందుబాటులోకి తెచ్చిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాంత్రి హరీష్ రావు , హెల్త్ సెక్రటరీ రిజ్వీ, డీఎంఈ డాక్టర్ రమేష్ రెడ్డలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు . ఈ సందర్భంగా కార్డియాలజీ విభాగం వైద్యులు, సిబ్బందిని డాక్టర్ నాగేందర్ అభినందించారు.

Advertisement

Next Story