కాల్ చేస్తే చాలు.. న్యాయసేవలు మీ వద్దకే !

by Shyam |
కాల్ చేస్తే చాలు.. న్యాయసేవలు మీ వద్దకే !
X

దిశ, సంగారెడ్డి: కరోనా తెచ్చిన ఇబ్బందులు అంతా ఇంతా కాదు. ఈ గడ్డు పరిస్థితి నుండి సాధారణ పరిస్థితికి చేరుకునేందుకు ఆయా రంగాల వారీగా ఎవరికి వారే ప్రత్యామ్నాయాలు వెతుకున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో న్యాయ సేవల విషయంలోనూ వినూత్న కార్యక్రమం చేపట్టారు. కరోనా వేళ దూర ప్రాంతాల్లోని కక్షి దారులకు సేవలు అందించాలన్న లక్ష్యంతో సంచార న్యాయ సేవల వాహనాన్ని న్యాయమూర్తులు, న్యాయవాదులతో కలిసి ఉమ్మడి జిల్లా కోర్టు న్యాయమూర్తి సాయి రమాదేవి ప్రారంభించారు.

హైకోర్టు ఆదేశాల మేరకు ఈ సేవలను ప్రారంభించినట్లు న్యాయమూర్తి కె . సాయిరమామాదేవి చెప్పారు. కక్షిదారుల వద్దకు ఈ వాహనంలో న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది వెళ్తారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుతో అనుసంధానించి సేవలు అందిస్తారు. అత్యవసరంలో అందించే ఈ న్యాయ సేవలను పొందాలంటే జిల్లా కోర్టు సంగారెడ్డి ల్యాండ్ లైన్ నెంబర్ 08455-270121, 9052424288, 9848483132 సంప్రదించాల్సి ఉంటుంది.

Advertisement

Next Story