- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
స్వదేశీ వీడియో కాన్ఫరెన్స్ యాప్ ‘లాక్’
దిశ, వెబ్‌డెస్క్ :
కరోనా కారణంగా చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఫెసిలిటీని కల్పించాయి. అంతేకాదు విద్యాలయాలు, కాలేజీలు, ఇతర కంపెనీలు కూడా తమ ఉద్యోగులతో కమ్యూనికేషన్ కోసం ‘వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్స్’పైనే ఆధారపడ్డాయి. దీంతో జియోమీట్, గూగుల్ మీట్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, జూమ్ యాప్స్ దూసుకుపోతున్నాయి. అయితే, చైనా యాప్స్‌ను బ్యాన్ చేయడంతో పాటు ప్రధాని మోదీ ఆత్మనిర్భర భారత్ పిలుపుతో.. ఇండియన్ టెకీలు స్వదేశీ యాప్స్ రూపొందిస్తున్నారు. ఇప్పటికే టిక్‌టాక్‌కు ఆల్టర్నేట్‌గా ఎన్నో దేశీ యాప్స్ వచ్చేశాయి. ఇప్పుడు అదే కోవలో జూమ్, గూగుల్ మీట్ వంటి వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్స్‌కు పోటీగా స్వదేశీ యాప్ ‘లాక్’ (lauk) వచ్చేసింది. సీనియర్ జర్నలిస్ట్ అనురంజన్ ఝా దీన్ని రూపొందించాడు. జర్నలిస్ట్ నుంచి ఎంట్రప్రెన్యూర్‌గా మారి ‘పార్క్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థను స్థాపించిన అనురంజన్.. లాక్‌ను పెయిడ్ ప్లాట్‌ఫామ్‌గా తీసుకొచ్చారు.
ఇండియన్ యూజర్లను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా తయారుచేసిన స్వదేశీ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్.. ‘లాక్’ అని నిర్వాహకులు తెలిపారు. ఇది బేసిక్ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్. ఐటీ సంస్థలే కాకుండా.. ఎడ్యుకేషనల్ సెక్టార్‌ను లక్ష్యంగా చేసుకుని దీన్ని తీసుకొచ్చారు. ఈ ఎడ్యుకేషన్‌కు ఇది పర్ఫెక్ట్ యాప్ అని అనురంజన్ అంటున్నారు. ఇందులో ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్‌ల కోసం లాక్ క్లాస్ రూమ్’, లైవ్ స్ట్రీమింగ్, వెబ్‌నార్లు, ఇతర సేవల కోసం ‘లాక్ స్టూడియో’ అనే ఫీచర్లు ఉన్నాయి. ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ల కోసం ప్రత్యేక ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రైవసీకి ప్రాధాన్యతనిచ్చి ‘ఎండ్ టూ ఎండ్ డిస్క్రిప్షన్’ ఫీచర్‌ను ఇందులో పొందుపర్చామన్నారు. దీని సబ్‌స్క్రిప్షన్ ధర నెలకు రూ.250 నుంచి రూ. 1500 వరకు ఉండనుంది.