- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు.. పక్క రాష్ట్రాల పరిస్థితిపై సర్కార్ ఆరా!
దిశ, తెలంగాణ బ్యూరో: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. కేసులు వ్యాప్తి చెందుతున్న రాష్ట్రాల్లోని పరిస్థితిపై ఆరా తీసింది. సోమవారం వైద్యశాఖతో సమీక్ష నిర్వహించింది. కొవిడ్ తీవ్రత లేదని, ఎలాంటి టెన్షన్లేదని వైద్యశాఖ ప్రభుత్వానికి వివరించింది. ఇక ఇదే అంశంపై కేంద్ర ఆరోగ్యశాఖ కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. కరోనా కేసులు పెరుగుతున్నందున టెస్టింగ్, కంటైన్మెంట్లపై ఫోకస్పెట్టాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. పాజిటివిటీ పెరుగుతున్న ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని కోరింది.
ముఖ్యంగా అర్బన్ఏరియాల్లో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం ఆదేశాలిచ్చింది. ఇకవారం రోజుల తర్వాత కేసులు తీరును పరిశీలించి ఏప్రిల్ 11,12న అన్ని ఆసుపత్రుల్లో మాక్డ్రిల్నిర్వహించాలని సర్కార్ఆలోచిస్తున్నది. కరోనా వార్డులు, బెడ్లు, స్టాఫ్, మందులు, పరికరాలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ సౌకర్యాలు వంటి వాటిపై ముందస్తు చర్యల్లో భాగంగా పరిశీలించనున్నారు. ఇప్పటికిప్పుడు మన స్టేట్‌పై కరోనా ప్రభావం ఉండే ఛాన్స్లేదని వైద్యాధికారులు పేర్కొంటున్నారు.