తెలంగాణ కాంగ్రెస్‌ కీలక నిర్ణయం.. వారి సంఖ్య పెంపు!

by GSrikanth |
తెలంగాణ కాంగ్రెస్‌ కీలక నిర్ణయం.. వారి సంఖ్య పెంపు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించుకుని ఎన్నికలకు సిద్ధం అయ్యే దిశగా అధిష్టానం దృష్టి సారించింది. ఈ క్రమంలో ప్రధాన కార్యదర్శుల పదవుల సంఖ్యను పెంచాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు పదవుల భర్తీపై పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్ రావు థాక్రే ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన కార్యదర్శుల సంఖ్యను 84 నుంచి 119కి పెంచేలా నిర్ణయించగా ఎంపిక ప్రక్రియను ప్రారంభించాలని అధిష్టానం ఏఐసీసీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రధాన కార్యదర్శులకు ఒక్కొక్కరిని ఒక్కో నియోజకవర్గ బాధ్యతలను అప్పగించబోతున్నారు. దీనితో పాటు పీసీసీలోకి మరో ముగ్గురు ఉపాధ్యక్షులు రానున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక ఎన్నికల తర్వాత నేతలంతా నియోజకవర్గాల బాట పట్టేలా అధిష్టానం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో తాజా మార్పులు ఆసక్తిగా మారాయి.

Advertisement

Next Story