GSLV F12 రాకెట్ ప్రయోగం విజయవంతం..కక్ష్యలోకి ఎన్‌వీఎస్ -1 ఉపగ్రహం

by Seetharam |   ( Updated:2023-06-16 14:52:03.0  )
GSLV F12 రాకెట్ ప్రయోగం విజయవంతం..కక్ష్యలోకి ఎన్‌వీఎస్ -1 ఉపగ్రహం
X

దిశ,వెబ్‌డెస్క్: ఇస్రో ఈ రోజు ఉదయం 10.42 గంటలకు ప్రయోగించిన GSLV F12 రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. ఈ ప్రయోగం ద్వారా నావిగేషన్ రంగానికి చెందిన ఎన్‌వీఎస్-01 ఉపగ్రహాన్ని ఇస్రో కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. కక్ష్యలోకి చేరడానికి 19 నిమిషాలు సమయం పట్టింది.

ప్రతిష్టాత్మక ఐఆర్‌ఎన్ఎస్‌ఎస్ ప్రోగ్రాంలో ఇది ఓ భాగం. ఇది రక్షణ రంగానికి, విమానయానరంగానికి దిక్సూచి వంటిది. దేశ సరిహద్దులో 1500 కిలో మీటర్ల మేర నావిక్‌ కవరేజ్‌ ఉండే విధంగా ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. ఇప్పటికే 7 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించి నావిగేషన్‌ వ్యవస్థను పటిష్టపరిచింది.

ఈ సిరీస్‌లో ముందుగా ప్రయోగించిన ఐఆర్‌ఎన్‌ఎస్ఎస్-1జి (IRNSS-1G) ఉపగ్రహ సేవలు నిలిచిపోవడంతో ఎన్‌వీఎస్-01 ఉపగ్రహాన్ని తాజాగా ప్రయోగించింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో 12 సంవత్సరాల పాటు ఇది సేవలందించనుంది. ఈ రాకెట్‌ ద్వారా 2232 కిలోల బరువు గల ఎన్‌వీఎస్-01 నావిగేషన్‌ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

Advertisement

Next Story

Most Viewed