- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లేదంటే.. పీడీ యాక్ట్ నమోదు చేస్తాం
దిశ, నాగర్ కర్నూల్: యావత్తు ప్రపంచాన్ని వణికితున్న కరోనా వైరస్ ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో సైతే విస్తరిస్తోందని, ఈ తరుణంలో ఆర్ఎంపీలు, పీఎంపీలు అత్యంత జాగ్రత్తగా ప్రజలకు వైద్యం అందించాలని జిల్లా ఇన్ చార్జ్ వైద్యాధికారి సుధాకర్ లాల్ పేర్కొన్నారు. కేవలం డబ్బు సంపాదన కోసమే ప్రాక్టీస్ చేయొద్దని, సామాజిక బాధ్యత, మానవత్వంతో రోగులకు వైద్యం అందించాలన్నారు. కోవిడ్-19 నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలన్నారు. లేదంటే పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
బుధవారం జిల్లా కేంద్రంలోని సిఎన్ రెడ్డి సేవా సదన్ నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూనే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వారు కేవలం ప్రథమ చికిత్స మాత్రమే జరపాలని, ఎక్కువ మోతాదులో మందుల వాడకాన్ని నిషేధించినట్లు ఆయన పేర్కొన్నారు. పరిమితికి మించి వైద్యం అందిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. దగ్గు, జలుబు వచ్చిన ప్రతి ఒక్కరికీ పాజిటివ్ గా అనుమానిస్తూనే వైద్యం అందించి తగిన సూచనలు సలహాలు అందించాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే సామూహిక వ్యాప్తి చెందే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మోహన్ రెడ్డి, డిప్యూటీ డీఎం అండ్ హెచ్ వో వెంకటదాసు, జిల్లాలోని ఆయా ప్రాంతాల ఆర్ఎంపీలు, పీఎంపీలు, పాల్గొన్నారు.