- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వృత్తుల వారీగా పంపిణీ: బడుగుల లింగయ్య
X
దిశ, తుంగతుర్తి: మత్స్య కార్మికుల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, తుంగతుర్తి ఎమ్మెల్యే డా. గాదరి కిశోర్ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అడివేంల గ్రామంలో 5వ విడత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా చౌట చెరువులో 2 లక్షల 70 వేల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ కుల వృత్తులకు జీవం పోస్తున్నారని, రాష్టంలోని సబ్బండ వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంతోపాటు వృత్తుల వారీగా అవసరమైన పరికరాలను, యంత్రాలును సబ్సిడీపై అందిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మన్నే రేణుక లక్ష్మీనర్సయ్య, ప్యాక్స్ చైర్మన్ కుంట్ల సురేందర్ రెడ్డి, సర్పంచ్లులు, ఎంపీటీసీలు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
Advertisement
Next Story