ఖమ్మంలో మరో 56 కేసులు వెలుగులోకి

by Sridhar Babu |   ( Updated:2020-08-08 08:30:08.0  )
ఖమ్మంలో మరో 56 కేసులు వెలుగులోకి
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: జిల్లా వ్యాప్తంగా శ‌నివారం కొత్త‌గా 56 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. 189 మంది అనుమానితులకు ఆర్‌టీఏ టెస్టులు నిర్వ‌హించ‌గా 56మందికి పాజిటివ్ వ‌చ్చిన‌ట్లుగా వైద్యాధికారులు తెలిపారు. ప్ర‌స్తుతం ఖ‌మ్మం జిల్లా ఆస్ప‌త్రి ఐసోలేష‌న్ వార్డులో 90 మంది చికిత్స పొందుతున్నారు. అలాగే మ‌ద్దులప‌ల్లి క‌రోనా కోవిడ్ ప్ర‌త్యేక వార్డు కేంద్రంలో 44 మంది చికిత్స పొందుతున్న‌ట్లుగా అధికారులు తెలిపారు. భద్రాచలం ఏరియా ఆస్ప‌త్రి ప‌రిధిలో శ‌నివారం 49 మందికి కరోనా పరీక్షలు నిర్వ‌హించ‌గా సీతారామాలయ సూప‌రింటెండెంట్‌తో పాటు ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ స‌హా 18 మందికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది.

Advertisement

Next Story

Most Viewed