- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఘోర ప్రమాదం.. లారీ టైర్ల కింద చిన్నారులు.. అక్కడికక్కడే మృతి..
దిశ,మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం చిక్కుడు గుంట వద్ద బైక్ ను బొగ్గులారీ వెనుక నుంచి ఢీ కొనడంతో ఇద్దరు చిన్నారులు, తండ్రి మృతి చెందారు. అంబోజు కృష్ణ అనే వ్యక్తి మణుగూరు లో ఆర్.ఎం.పి డాక్టర్ గా పనిచేస్తున్నాడు. శనివారం మంగపేట నుంచి మణుగూరు వస్తుండగా చిక్కుడుగుంట వద్ద బొగ్గులారీ (AP 24 TA 0099) ఓవర్ టేక్ చేస్తూ అంబోజు కృష్ణ బైక్ ను వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ క్రమంలో బైక్ పైన ఉన్న ఇద్దరు చిన్నారులు లారీ టైర్ల వెనుక పడ్డారు. అంబోజు అమల్ ప్రీతం (7)ను వెనుక టైర్ తొక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అంబోజు జాహ్నవి(10)కు తీవ్రగాయాలు అయ్యాయి. చిన్నారులు పడ్డ విషయాన్ని గమనించక లారీ డ్రైవర్ బాబును తొక్కుకుంటూ సుమారు కిలో మీటర్ వరకు ఈడ్చుకొని వెళ్లాడని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానిక ఏఎస్ఐ నాగేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఇద్దరు చిన్నారులు రోడ్డు మీద విగతజీవులుగా ఉంటే ఏ వాహనం ఆగలేదని స్థానికులు తెలిపారు. చివరికి పాపని పోలీస్ వాహనంలో ఎక్కించుకోవడానికి ఏఎస్ఐ నాగేశ్వరరావు నిరాకరించారని స్థానికులు ఆరోపించారు. ఈ క్రమంలో అటుగా వస్తున్న ప్రభుత్వవిప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఘటన స్థలానికి వచ్చి బాబుని, పాపని చూసి కన్నీరు మున్నీరయ్యారు. వెంటనే పాపను పోలీస్ వాహనంలో ఎక్కించి స్థానిక హాస్పిటల్ కి పంపించారని స్థానికులు తెలిపారు. బాబు, తండ్రి అక్కడికక్కడే మృతి చెందగా పాప పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. అనంతరం సీఐ భానుప్రకాష్ మృతదేహాలను పంపించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.